తారక్ ను నేనే వద్దన్నాను : కళ్యాణ్ రామ్

First Published 24, Mar 2018, 1:36 PM IST
Kalyan Ram said to tarak not to attend pre release function
Highlights
  • కల్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ వస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది
  • కానీ తారక్ కి రావడం కుదరలేదు
  • ఒకవేళ వస్తే త్రివిక్రమ్ మూవీ లుక్ రివీల్ అవుతుందని నేనే వద్దన్నా

నందమూరి కల్యాణ్ రామ్, కాజోల్ జంటగా తెరకెక్కిన ‘ఎమ్మెల్యే’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరగినప్పటికీ, ఆయన మాత్రం రాలేదు. ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ బదులిచ్చారు. త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడని, లుక్ ను మొత్తం మార్చేసుకున్నాడని చెప్పాడు.

ఒకవేళ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు తారక్ వస్తే, అతని లుక్ అవుట్ అవుతుందని… అందుకే ఫంక్షన్ కు రావద్దని తానే చెప్పానని తెలిపాడు. ఎన్టీఆర్ తాజా లుక్ చూసి తాను కూడా చాలా హ్యాపీ ఫీలయ్యానని తెలిపాడు. ఈవెంట్ కు ముందు తామిద్దరం మాట్లాడుకున్నామని కల్యాణ్ రామ్ చెప్పాడు. ఫంక్షన్ కు రావాలని తారక్ భావించినప్పటికీ, లుక్ అవుట్ అవుతుందేమో అని ఇబ్బంది పడ్డాడని తెలిపాడు. దీంతో, తానే కల్పించుకుని, ఫీల్ అవద్దని చెప్పానని అన్నాడు. తామిద్దరం ప్రొఫెషన్ ను చాలా సీరియస్ గా తీసుకుంటామని తెలిపాడు. తారక్ విషయంలో తన స్వార్థం తాను చూసుకోకూడదని భావించానని… అతని కష్టాన్ని తాను తీసేసుకోకూడదని అనుకున్నాని చెప్పాడు.
 

loader