Asianet News TeluguAsianet News Telugu

టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ‘బింబిసార’..ఇంట్రస్టింగ్ అప్డేట్

మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రం ‘బింబిసార’. కత్తిని పట్టుకుని కల్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో, గెటప్ లో కన్పించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. 

Kalyan Ram's Bimbisara to join December race?
Author
Hyderabad, First Published Nov 18, 2021, 8:17 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హీరోగా, నిర్మాత‌గా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల చేస్తూనే మరో ప్రక్క ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ప్రేక్ష‌కులు హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. ఆయన బింబిసార’  అంటూ మ‌రో ఎక్స్‌పెరిమెంట్‌కు సిద్ధ‌మ‌య్యారు.  బింబిసార టైటిల్ రోల్ లో ఆయనే న‌టిస్తున్నారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో క‌ళ్యాణ్ రామ్ లుక్‌, బ్యాక్‌డ్రాప్ అన్ని సరికొత్త‌గా ఉన్నాయి...క్రూరుడైన బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శ‌త్రు సైనికుల‌ను చంపి వారి శ‌వాల‌పై ఠీవిగా కూర్చున్న క‌ళ్యాణ్ రామ్ లుక్ టెరిఫిక్‌గా ఉందంటూ మెచ్చుకున్నారు.

 తొలిసారిగా క‌ళ్యాణ్ రామ్ ఇలాంటి డిఫరెంట్ పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో పాటు, ఆ పాత్ర లుక్‌, బ్యాక్ డ్రాప్ సినిమాపై ఆస‌క్తిని పెంచింది.  కానీ ఆ తర్వాత ఆ సినిమా గురించి అప్డేట్స్ ఏమీ రాలేదు. అసలు ఈ సినిమా ఎంతదాకా వచ్చిందో ఎవరికీ తెలియలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో తాజాగా ఓ అప్డేట్ వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది.

 ‘బింబిసార’ సినిమా డిసెంబర్ లో విడుదల కానున్నట్టు సమాచారం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్య సినిమా ‘అఖండ’ డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. దీంతో అఖండ థియేటర్లలోనే బింబిసార రిలీజ్ డేట్ తో కూడిన ట్రైలర్స్ ను వదలాలనేది ప్లాన్ అని తెలుస్తోంది. దాంతో అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగిందన్నది సినీ, మీడియా వర్గాల్లో ఆశ్చర్యకరంగా మారింది.

ఇక ‘బింబిసార’ సినిమా చారిత్రకం కాదు. ఇదో టైమ్ ట్రావెల్ చిత్రం.మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్ లైన్. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది.. ‘ఆదిత్య 369’ తరహాలో టైమ్ మెషిన్ లో హీరో ‘బింబిసార పరిపాలనా కాలానికి చేరుకుంటారట. అప్పుడు జరిగే ఆసక్తికరమైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.  ఇక ఇందులో కళ్యాణ్ రామ్ సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్  హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఎంత మంచివాడవురా’ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ నటించే చిత్రం ఇదే అవడం విశేషం.  

Also read RRR Movie: 'నాటు నాటు' సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ డాన్స్.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వీడియో ఇదిగో

‘గ‌తేడాది షూటింగ్‌ స్టార్ట్ చేశాం. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ కీల‌కంగా.. భారీ సెట్స్‌తో క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నిక‌ల్ వాల్యూస్ మూవీ ఇది. త్వరలో ‘బింబిసార’ చిత్రాన్ని విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నాం’ అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Also read Bheemla Nayak: 'భీమ్లా నాయక్' ఎఫెక్ట్.. సంక్రాంతి ఫైట్ పై ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం

ఈ చిత్రానికి పాట‌లు: సిరి వెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి, డాన్స్‌: శోభి, ర‌ఘు, ఫైట్స్‌: వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: అనిల్ ప‌డూరి, ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, మ్యూజిక్‌: చిరంత‌న్ భ‌ట్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు, ప్రొడ్యూస‌ర్‌: హ‌రికృష్ణ.కె, ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్‌.
 

Follow Us:
Download App:
  • android
  • ios