RRR Movie: 'నాటు నాటు' సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ డాన్స్.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వీడియో ఇదిగో

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర మ్యానియా దేశం మొత్తం వ్యాపించింది. 'నాటు నాటు' సాంగ్ విడుదలయ్యాక ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి. 

Hook Step Tutorial of Naatu Naatu Song From RRR Movie

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR Movie మ్యానియా దేశం మొత్తం వ్యాపించింది. ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాపై దేశం మొత్తం సినీ అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. కానీ 'నాటు నాటు' సాంగ్ విడుదలయ్యాక ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి. 

ఈ పాటలోని బీట్.. Jr NTR, Ram Charan డాన్స్ మూమెంట్స్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి ఈ సాంగ్ లో చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులని ట్రై చేస్తూ కుప్పలు తెప్పలుగా వీడియోలు వస్తున్నాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సాంగ్ రీచ్ ఎలా ఉందో అని.నాటు నాటు సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి జక్కన్న అండ్ టీం ఫుల్ హ్యాపీగా ఉంది. 

ఎన్టీఆర్, చరణ్ మెరుపు వేగంతో డాన్స్ చేస్తూ అలరిస్తున్నారు. జస్ట్ లిరికల్ విడియోలోనే ఇలా ఉంటే ఫుల్ సాంగ్ లో అది కూడా వెండితెరపై వీరిద్దరి స్టెప్పులు ఎలా ఉండబోతున్నాయో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ క్రేజ్ ని ఆర్ఆర్ఆర్ మూవీ టీం కూడా క్యాష్ చేసుకుంటోంది. 

ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్ కి డాన్స్ కంపోజింగ్ చేశారు. పాటకు తగ్గట్లుగా ఎన్టీఆర్, చరణ్ చేత మాస్ స్టెప్పులు వేయించారు. ఈ సాంగ్ కి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఎలా కొరియోగ్రఫీ అందించారో తెలిపేలా చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. 

ఈ వీడియోలో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తన అసిస్టెంట్స్ కి నాటు నాటు సాంగ్ డాన్స్ మూమెంట్స్ నేర్పిస్తున్నారు. ఈ వీడియో నెటిజన్లని బాగా ఆకట్టుకుంటోంది. నాటు నాటు సాంగ్ ఎంత పెద్ద హిట్ కావడానికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా కారణం అంటూ నెటిజన్లు ఆయన్ని అభినందిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి. 

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios