కళ్యాణ్ రామ్ పక్కకు తప్పుకున్నాడు!

కళ్యాణ్ రామ్ పక్కకు తప్పుకున్నాడు!

మొదటిసారిగా కళ్యాణ్ రామ్ లవర్ బాయ్ అవతారమెత్తాడు. 'నా నువ్వే' అంటూ తమన్నాతో కలిసి రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించాడు. ఈ సినిమా టీజర్, సాంగ్ ప్రోమోస్ అంటూ బాగానే హడావిడి చేస్తున్నారు. మే 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా చిత్రబృందం ఈ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. జూన్ నెలలో మంచి డేట్ ను చూసి సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

దానికి కారణం ప్రస్తుతం థియేటర్ లో 'మహానటి'తో పాటు 'భరత్ అనే నేను' సినిమా కూడా జోరు చూపిస్తోంది. మే 25న రవితేజ నటించిన 'నేల టికెట్టు' సినిమా కూడా విడుదల కానుంది. ఇటువంటి సమయంలో పోటీగా 'నా నువ్వే;' రిలీజ్ చేయడం కంటే కాస్త ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. అసలే కళ్యాణ్ కెరీర్ లో ఇదొక ప్రయోగాత్మక సినిమా అనే చెప్పాలి.

లవర్ బాయ్ గా ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారనేది ఊహించలేం. కానీ ఈ సినిమా కోసం కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు. అందుకే పోటీ లేకుండా తీరికగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సో మే 25న మాస్ మహారాజాకు సోలో రిలీజ్ దక్కినట్లే..  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page