Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల్లోకి కల్యాణ్ రామ్.. ఎప్పుడంటే..

  • ఎమ్మెల్యే మూవీ నేపథ్యంలో రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన కల్యాణ్ రామ్
  • రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని నందమూరి కల్యాణ్ రామ్ కు ప్రశ్న
  • ఎప్పుడంటే.. నా సినిమాలు ఇక చూడలేం అన్నప్పుడన్న కల్యాణ్ రామ్
kalyan ram interesting comments on political entry

నందమూరి నటవారసుల్లో హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కల్యాణ్ రామ్. తాజాగా ‘ఎమ్మెల్యే’ అనే టైటిల్ తో సినిమా తీయడంతో.. కల్యాణ్ రామ్ రాజకీయ ఎంట్రీపై చర్చ పెద్దయెత్తున మొదలైంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో నందమూరి కుటుంబానిది ప్రత్యేక స్థానం. అలాంటి కుటుంబానికి చెందిన హీరో కావడం, తాత సీఎంగా, తండ్రి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యం కల్యాణ్ రామ్ రాజకీయ రంంగ ప్రవేశంపై చర్చకు తెరలేపింది.

 

తాజాగా కల్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే సినిమా రిలీజ్ కు రెడీ అయింది. దీంతో ‘ఎమ్మెల్యే’ సినిమా నేపథ్యంలో చర్చ కాస్త ఎక్కువైంది. ఎమ్మెల్యే.. అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి.. అనే నిర్వచనంతో ఈ సినిమాను రూపొందించినా, ఇతడిని ఎమ్మెల్యేగా చూడాలంటున్న వాళ్లు చాలా మందే కనిపిస్తున్నారు. వీరిలో నందమూరి ఫ్యాన్స్ ముందున్నారు.



ఇదే అంశాన్ని ఇప్పుడు కల్యాణ్ రామ్ ముందుకు కూడా తీసుకొచ్చారు. ఫేస్ బుక్ చాట్ లో కల్యాణ్ రామ్ ను ఈ ప్రశ్న అడిగారు ఫ్యాన్స్. ‘రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు.. ఎమ్మెల్యే ఎప్పుడు కాబోతున్నారు?’ అని వారు చొరవగా అడిగారు. దీనికి ఆసక్తిదాయకమైన రీతిలో సమాధానం ఇచ్చాడు కల్యాణ్ రామ్.
 

రాజకీయాలపై ఈ హీరో ఏమన్నాడంటే.. ‘ఇక సినిమాలు చాలు. మీ సినిమాలు చూడలేం.. ’అనే స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చినప్పుడు తను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను అని ఈ హీరో చమత్కరించాడు. రాజకీయాల్లోకి అస్సలు రాను.. అనే సమాధానాన్ని మాత్రం కల్యాణ్ రామ్ ఇవ్వలేదు. రాజకీయాల్లోకి వస్తాను కానీ.. ఇప్పుడు కాదనే ధోరణితో మాట్లాడాడు.

Follow Us:
Download App:
  • android
  • ios