మెగాస్టార్  చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మాత సాయి కొర్రపాటి.. కళ్యాణ్ ను లాంచ్ చేయనున్నారు. ఇటీవల ఈ సినిమాకు 'విజేత' అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. చిరు కెరీర్ లో హిట్ సినిమా టైటిల్ ను తన సినిమాకు పెట్టుకున్నాడు కళ్యాణ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

సింపుల్ టీ షర్ట్ తో ఈ పోస్టర్ లో అందంగా కనిపిస్తున్నాడు కళ్యాణ్. రాకేశ్ శశి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా విషయంలో మెగాస్టార్ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు. ఎలాంటి అంచనాలు కలిగించకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు ఓ సందేశాన్ని కూడా చెప్పబోతున్నాడు.