కాలా సినిమా సీన్స్ లీక్: సింగపూర్ లో ఒకరి అరెస్టు

First Published 7, Jun 2018, 7:56 AM IST
Kala live stream leaked: One arrested
Highlights

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కాలాకు పైరసీ దెబ్బ తప్పలేదు.

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కాలాకు పైరసీ దెబ్బ తప్పలేదు. సింగపూర్ నుంచి 15 నిమిషాల సీన్లు లీకైనట్లు తెలుస్తోంది. లీకైన సీన్లు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. సింగపూర్ నుంచి ఆ లైవ్ స్ట్రీమ్ లీకయినట్లు తెలుస్తోంది.

సింగపూర్ నుంచి ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమ్ ను లీక్ చేసిన ప్రవీణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఫేస్ బుక్ లో పోస్టు చేసిన లైవ్ స్ట్రీమ్ ను తొలగించారు. కాలా సినిమాకు సంబంధించిన నాలుగైదు సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాలా సినిమా లీక్ పై నిర్మాత ధనంజయన్ ట్విట్టర్ స్పందించారు. పైరసీకి సంబంధించి షాకింగ్ వార్త అని ఆయన వ్యాఖ్యానించారు. దానిపై హీరో విశాల్ కూడా స్పందించారు. నిర్మాత ధనంజయన్ కు ట్యాగ్ చేస్తూ ఆయన తన ప్రతిస్పందనను ట్విటర్ లో పోస్టు చేశారు.

loader