కాజల్ షాకింగ్ రెమ్యునరేషన్!

kajal's shocking remuneration
Highlights

ఈ సినిమా కోసం అమ్మడుకి ఎంత రెమ్యునరేషన్ దక్కిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా కోటి ఇరవై లక్షలు. 33 ఏళ్లు గల ఈ సుందరికి ఇప్పటికీ కోట్లలో రెమ్యునరేషన్ దక్కడం విశేషమనే చెప్పాలి

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన జతకట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటి కాజల్ ఇప్పటికీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుతోంది. ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. కాజల్ కు మాత్రం ఛాన్సులు తగ్గడంలేదు. రీసెంట్ గా హీరో గోపీచంద్ తో కలిసి నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. గోపీచంద్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు.

'జిల్' సినిమా తరువాత ఇప్పటివరకు సక్సెస్ అందుకోలేదు గోపీచంద్. అందుకే ఈసారి కథ,. నటీనటుల విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సినిమా సక్సెస్ అతడికి చాలా ముఖ్యం. అందుకే హీరోయిన్ గా కాజల్ ను రంగంలోకి దింపారు. ఈ సినిమా కోసం అమ్మడుకి ఎంత రెమ్యునరేషన్ దక్కిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా కోటి ఇరవై లక్షలు. 33 ఏళ్లు గల ఈ సుందరికి ఇప్పటికీ కోట్లలో రెమ్యునరేషన్ దక్కడం విశేషమనే చెప్పాలి.

గతంలో గోపీచంద్ నటించిన 'మొగుడు' సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించాల్సింది కానీ కుదరలేదు. ఈసారి మాత్రం వెండితెరపై ఈ జంట రొమాన్స్ చేయనుంది. కుమార్ సాయి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. 

loader