చిరు సరసన మరోసారి కాజల్ కు అవకాశం చిరుతో ఇంకోసారి చేయనన్న కాజల్ సైరాలో అవకాశాన్ని వదులుకున్న బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మాతగా వస్తోన్న ఈ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా రాబోతుంది. పరుచూరి బ్రదర్స్ కథ అందించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కు అవకాశం ఉండగా దాని కోసం కాజల్ ను సంప్రదించారట.

ఇప్పటికే చిరు పక్కన ఖైది నంబర్ 150తో జోడి కట్టిన ఈ అమ్మడు సైరా నరసింహారెడ్డికి మాత్రం సారీ అనేసిందట. చిరు ఆఫర్ నే కాదనాల్సినంత లెవెల్ లో కాజల్ ఫోజు కొడుతోందా అంటే... సినిమాలో ఆమె పాత్ర చాలా చిన్నదట. అంతేకాదు.. తాను ఒకసారి నటించిన హీరోతో మరోసారి చేయదట. అందుకే కాజల్ ఆ ఆఫర్ ను తిరస్కరించిందని అంటున్నారు. 

మెగాస్టార్ సరసన ఖైది నంబర్ 150తోనే సూపర్ హిట్ అందుకున్న కాజల్ ఆ తర్వాత మళ్లీ కెరియర్ లో మంచి జోష్ అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా హిట్ అవడంతో కాజల్ రేంజ్ పెరిగింది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ వరుస ఆఫర్లు అందుకుంటుంది. దీంతో ఇప్పటికే నయనతారను లీడ్ రోల్ కు అనుకున్న సినిమాలో తను నటించడం ఏంటని కాజల్ ఫీలవుతోందని తెలుస్తోంది.

కాజల్ మెగాస్టార్ చిరు ఆఫర్ సైతం కాదనడానికి కారణం నయన్ ను ఆల్రెడీ లీడ్ రోల్ కు తీసుకోవటమేనని, అందుకే మరో ఆఫర్ వచ్చినా కాదందని టాక్ వినిపిస్తోంది. ఇక కాజల్ కాదన్న ఆ ఆఫర్ నే ప్రగ్య జైశ్వాల్ అందుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం కాజల్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన మెర్సల్ సినిమాలో నటించింది. దీపావళికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.