MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Poorna: రెండోసారి తల్లి అయిన పూర్ణ.. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంటూ భర్త ఎమోషనల్‌ పోస్ట్

Poorna: రెండోసారి తల్లి అయిన పూర్ణ.. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంటూ భర్త ఎమోషనల్‌ పోస్ట్

Poorna: నటి పూర్ణ  రెండోసారి తల్లి అయ్యారు. ఆమెకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 14 2026, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెండోసారి తల్లి అయిన పూర్ణ
Image Credit : Facebook

రెండోసారి తల్లి అయిన పూర్ణ

నటి పూర్ణ(షమ్నా కసిమ్‌) మరోసారి తల్లి అయ్యారు. ఈ రోజు(శనివారం) ఉదయం ఆమెకు ఒక పండంటి కూతురు జన్మించింది.  'అల్లా(దేవుడు) ఇచ్చిన అమూల్యమైన బహుమతి' అంటూ ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని షానిద్ తెలిపారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆనందాన్ని పంచుకున్న పూర్ణ భర్త
Image Credit : Instagram

ఆనందాన్ని పంచుకున్న పూర్ణ భర్త

షానిద్ ఆసిఫ్ అలీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా రాశారు: 'అల్లా దయతో, ఈ రోజు ఉదయం 4:25 గంటలకు మా కుటుంబంలోకి ఒక ఆడబిడ్డ వచ్చింది. ఆమె అల్లా ఇచ్చిన అమూల్యమైన బహుమతి, మా హమ్దు కుట్టీకి ప్రియమైన సోదరి. ఇది మా కుటుంబానికి లభించిన గొప్ప ఆశీర్వాదం. సుఖ ప్రసవం జరిగింది. అల్లాహ్ మా బిడ్డను, కుటుంబాన్ని ఆశీర్వదించాలి. డాక్టర్ సఫా ఫాతిమా, డెలివరీ రూమ్‌లో మాతో ఉన్న నర్సులు, ఆస్టర్ హాస్పిటల్ సిబ్బందికి మా ధన్యవాదాలు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్' అని పేర్కొన్నారు.

Related Articles

Related image1
OTT Movies: ఒకే రోజు ఓటీటీలోకి 47 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. తెలుగు మూవీస్‌ ఇవే.. నవ్వులే నవ్వులు
Related image2
Allu Arjun: పేరెంట్స్ చనిపోవడంతో హోటల్‌లో క్లాస్‌మేట్‌.. అల్లు అర్జున్‌ లైఫ్‌ని మార్చిన అమ్మ నిర్ణయం
34
 ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన పూర్ణ
Image Credit : Shamna Kasim Instagram

ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన పూర్ణ

పూర్ణ - షానిద్ దంపతులకు 2023, ఏప్రిల్ 4న మొదటి కొడుకు హమ్దాన్ పుట్టాడు. యూఏఈలో 24 ఏళ్లు గడిపిన జ్ఞాపకార్థం, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ పేరును షానిద్ తన కొడుక్కి పెట్టారు. షానిద్ ఆసిఫ్ అలీ JBS గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్నారు. వీరి వివాహం దుబాయ్‌లో జరిగింది. కేరళలోని కన్నూర్‌కు చెందిన షామ్నా, మొదట స్టేజ్ షోలతో తన కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. హీరోయిన్‌గా మెప్పించింది. అనేక విజయాలు అందుకుంది. ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో కీలక పాత్రలతో మెరుస్తోంది. 

44
పూర్ణ తెలుగు సినిమాలు
Image Credit : Shamna Kasim Instagram

పూర్ణ తెలుగు సినిమాలు

శ్రీమహాలక్ష్మి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది పూర్ణ. తెలుగులో ఆమె పూర్ణగా గుర్తింపు తెచ్చుకుంది. `అవును` చిత్రంతో విజయాన్ని అందుకుంది. `సీమ టపాకాయ్‌`, `నువ్వలా నేనిలా`, `లడ్డుబాబు`, `జయమ్ము నిశ్చయమ్మురా` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరగా ఆమె `అఖండ 2`లో మెరిసింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!
Recommended image2
Toxic Collections: 300 కోట్లు దాటిన యశ్ మూవీ, భారీగా పడిపపోయిన టాక్సిక్ కలెక్షన్స్, 6 వరోజు ఎంత వసూలు చేసిందంటే?
Recommended image3
Pawan - Jr NTR: పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు, లుక్స్ చూసి బంపర్ హిట్ అనుకున్నారు.. కానీ సినిమాలన్నీ అస్సాం
Related Stories
Recommended image1
OTT Movies: ఒకే రోజు ఓటీటీలోకి 47 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. తెలుగు మూవీస్‌ ఇవే.. నవ్వులే నవ్వులు
Recommended image2
Allu Arjun: పేరెంట్స్ చనిపోవడంతో హోటల్‌లో క్లాస్‌మేట్‌.. అల్లు అర్జున్‌ లైఫ్‌ని మార్చిన అమ్మ నిర్ణయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved