అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాజుగారి గది2. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ హర్రర్ జోనర్ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటించిన రాజుగారి గది సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

 

.ఈ సినిమాలో మెంటలిస్టు పాత్ర లో నాగార్జున నటించగా,  దెయ్యం పాత్రలో సమంత కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మరొక ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

 

కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తోందని, ఆమె క్యారెక్టర్ సినిమాని ఒక కీలక మలుపు తిప్పుతుందని సమాచారం. 

కాజల్ కూడా ఈ సినిమాలో కొంతసేపు దెయ్యంగా కనిపిస్తుందని అంటున్నారు. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం కోసమే ఈ విషయాన్ని దాచారని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి.