Asianet News TeluguAsianet News Telugu

కాకినాడ "కాజ"ల్ లాంటి మనసు

  • తూగో జిల్లా కాకినాడలో కాజల్ అగర్వాల్ సందడి
  • కేన్సర్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న తార
  • కాకినాడకు "కాజా"ల్ రాకతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు
kajal in cancer awareness program

కాజల్ అగర్వాల్ కరియర్ ఇప్పుడు మళ్లీ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది. క్రితం ఏడాది వరుసగా పవన్ కళ్యాణ్.. మహేష్ బాబులు ఛాన్స్ లు ఇచ్చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం సినిమాలు నిరాశపరిచినా.. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఖైదీ నంబర్ 150 టాలీవుడ్ రికార్డు హిట్ గా నిలవడం.. చిరంజీవితో అమ్మడు డ్యాన్సులతో కుమ్మేయడంతో.. మళ్లీ టాప్ రేంజ్ లోకి వచ్చేసింది కాజల్.
 

స్వతహాగా చారిటీ అంటే చాలు హ్యుమానిటీ చాటే తారల్లో కాజల్ ముందుంటుంది. నలుగురికి మేలు జరిగే కార్యక్రమాల్లోనూ కాజల్ నాలుగు అడుగులు ముందే ఉంటుంది. తాజాగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సడెన్ గా దర్శనం ఇచ్చింది కాజల్ అగర్వాల్. క్యాన్సర్ బాధితుల కోసం కాకినాడలో ఓ అవగాహనా ర్యాలీ జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి వచ్చి ర్యాలీలో పాల్గొని అందరి మనసు దోచుకుంది అందాల తార.

చాలా సింపుల్ డ్రెసింగ్ తో.. మేకప్ విషయంలో చిన్నపాటి టచప్ లు తప్ప మరేమీ లేకుండా.. ప్లెయిన్ గా దర్శనమిచ్చింది కాజల్. వైట్ ప్యాంట్.. బ్లూ స్ట్రైప్స్ టాప్ తో చాలా సాదాసీదాగా కనిపించింది కాజల్ అగర్వాల్. ఛారిటీ ఈవెంట్స్ లో పాల్గొంటుంది కానీ.. ఇంత ఓపెన్ గా ర్యాలీలో పార్టిసిపేట్ చేసి..కాజల్ చాలామందికి స్ఫూర్తినిచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios