చందమామలా మెరిసేకాజల్ అగర్వాల్ 32 ఏళ్ల వయసులో కూడా కెరీర్ మంచి ఫేజ్ లో కొనసాగుతోంది. రోజు రోజుకూ ఈమె సౌందర్యం పెరుగుతుండడమే దీనికి కారణం. సుకుమారిలా కనిపించే కాజల్ అగర్వాల్ మనసులో చాలా వైలెంట్ కోరిక దాగి ఉంది. ఇప్పటి వరకు హీరోల సరసన అందాలు ఆరబోసిన కాజల్ అగర్వాల్ కు పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో నటించాలని కోరికగా ఉందట. యాక్షన్ చిత్రంలో పోరాటాలు చేయడానికి కూడా తాను ఉవ్విళ్లూరుతున్నట్లు కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ కు ఇలాంటి కోరిక ఎందుకు కలిగిందని ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

కాజల్ అగర్వాల్ ఈ ముహూర్తాన చందమామ చిత్రంలో నటించిందో కానీ ఆ పేరు ఈ భామకు అక్షరాలా సరిపోతుంది. కాజల్ ముఖ సౌందర్యం చంద్రబింబంలా ఎప్పుడూ వెలిగిపోతూ ఉంటుంది. కాజల్ అందరిని ఆకర్షించడానికి ఇదే కారణం.హీరోయిన్లు ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ ఆ ఆప్రభావం కనిపిస్తోంది. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రోజు రోజుకూ కాజల్ అగర్వాల్ అందం పెరుగుతూనే ఉంది. కాజల్ టాలీవుడ్ కు వచ్చి దశాబ్దంపైగా అవుతోంది. అయినా కూడా ఈ భామ స్థిరంగా మంచి అవకాశాలని అందుకుంటోంది.కాజల్ అగర్వాల్ దాదాపుగా సౌత్ లో ఉన్న స్టార్స్ అందరితో నటిచింది.

 గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మెప్పించింది.వరుస చిత్రాలు చేస్తున్నప్పటికీ కాజల్ అగర్వాల్ కు మాత్రం ఓ కోరిక అలాగే ఉండిపోయిందని చెబుతోంది. పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో, పోరాట సన్నివేశాల్లో నటించాలనేది కాజల్ కోరికట. అలాంటి అవకాశం వస్తే మాత్రం అదరగొడుతానని ధీమా వ్యక్తం చేస్తోంది.