అప్పట్లో టాలీవుడ్ లో అతిలోక సుందరి శ్రీదేవి ఓ సంచలనం. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో రొమాన్స్ చేసిన శ్రీదేవి.. వారి తర్వాతి తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సరసన కూడా నటించింది. ఇలా ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగడం.. రెండు తరాల నటులతో నటించే అవకాశం అందుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 

ఇటీవల కాలంలో అలా రెండు తరాల హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు చాలా తక్కువగా కనిపిస్తారు. వారిలో అందాల చందమామ కాజల్ ఒకరు. వన్నె తరగని అందం కాజల్ సొంతం. దాదాపు దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. 

తెలుగులో కాజల్ అగర్వాల్ మహేష్, ఎన్టీఆర్, పవన్, రాంచరణ్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర హీరోలందరితో నటించింది. రాంచరణ్ తో పలు చిత్రాల్లో నటించిన కాజల్.. ఖైదీ నెం 150లో మెగాస్టార్ తో కూడా రొమాన్స్ చేసింది. మరోసారి ఇలాంటి కాంబినేషన్ సెట్ కంబోతున్నట్లు టాక్. 

దడ చిత్రంలో కాజల్ నాగ చైతన్య సరసన నటించింది. ఇప్పుడు అతడి తండ్రి నాగార్జునతో రొమాన్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జునతో కలసి కాజల్ ఇంతవరకు నటించలేదు. ఇటీవల నాగార్జున ఓ డెబ్యూ దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

'చే గువేరా' పేరు చెప్పగానే నా తమ్ముడు పవన్ గుర్తొచ్చాడు.. చిరంజీవి!

ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆల్రెడీ మెగా ఫ్యామిలీని చుట్టేసిన చందమామ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలిలో కూడా రెండు తరాల హీరోలతో నటించబోతోంది.