దశాబ్ద కాలంగా తెలుగులో హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ టాప్ హీరోస్ అందరి సరసన నటించి అగ్ర హీరోయిన్ గా మారిన కాజల్ ఇక త్వరలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న అందాల తార కాజల్ అగర్వాల్

టాలీవుడ్ అగ్ర కథానాయకల్లో ఒకరైన నటి 'కాజల్'. అందం, అభినయంతో తెలుగు, తమిళ సినిమాలతోనే కాక బాలీవుడ్ లోనూ తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. మూడు పదుల వయస్సు దాటుతున్నా ఇంకా పెళ్లి చేసుకోని ఈ ముద్దుగుమ్మపై ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే 'కాజల్' పెళ్లి పీటలెక్కనుందని టాక్.

ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో కొంతకాలంగా ఈ అమ్ముడు ప్రేమాయణం సాగిస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. అతడినే వివాహం చేసుకోవాలని 'కాజల్' నిర్ణయించుకోవడం..కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ వివాహం చేసుకోవడానికి కొంత సమయం కావాలని 'కాజల్' భావిస్తున్నారని, దీనికి కుటుంసభ్యులు అంగీకరించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే మూడు పదుల వయసు దాటడంతో పెళ్లికి ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దని ఆమె కుటుంబ సభ్యులు తొందరపెడుతున్నారట. దీంతో తాను ఒప్పుకున్న సినిమాలన్నింటినీ పూర్తి చేసేసి పెళ్లికి సిద్ధం కావాలని 'కాజల్' నిర్ణయించుకున్నట్లు టాక్. మెగాస్టార్ 'చిరంజీవి' తో 'ఖైదీ నెంబర్ 150’ సినిమాలో 'కాజల్' నటించిన కాజల్ ప్రస్తుతం 'రాజు నేనే మంత్రి' చిత్రంలో రానా సరసన కథానాయికగా నటిస్తోంది.

మరి కాజల్ పెళ్లి పీటలెక్కుతుందా.. లేక ఇంకా కొన్ని రోజులు సినిమాలు చేస్తుందా.. అని అబిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతైనా సినిమాలు చేస్తే మరి కొంత కాలం కాజల్ అందాలు తిలకించొచ్చని అభిమానులకు చిన్న ఆశ.