Asianet News TeluguAsianet News Telugu

విటమిన్స్ లేవు.. రాధ మాత్రమే వుందంటూ బిత్తిరిసత్తితో కాజల్ ఫన్

  • తీన్మార్ కార్యక్రమంతో వార్తల ప్రజెంటేషన్ లో కొత్త ఒరవడి సృష్టించిన బిత్తిరి సత్తి
  •  జోగేంద్ర గర్జనలో కాజల్ అగర్వాల్ తో  బిత్తిరి సత్తి ఫన్నీ సంభాషణ
  • నేనే రాజు నేనే మంత్రిలో విటమిన్లు లేవంటూ సమాధానమిచ్చిన కాజల్
kajal agarwal made fun with bithiri sathi in jogendra garjana function

తీన్మార్ కార్యక్రమంతో వార్తల ప్రజెంటేషన్ లో కొత్త ఒరవడి సృష్టించిన బిత్తిరి సత్తి... అలియాస్ రవి ఇప్పుడు సినిమాల్లో కూడా బాగానే రోల్స్ చేస్తున్నాడు.  ఈ మద్య రిలీజ్ అయిన జయదేవ్, ‘గౌతమ్ నంద’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు మరింత దొచాడు.  గత పదిహేను సంవత్సరాల నుంచి రాని గుర్తింపు బుల్లితెరపై ‘బిత్తిరి సత్తి’గా నటించి సంపాదించాడు.  కేవలం ఆ చానల్ లో మాత్రమే కాకుండా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్న బిత్తిరి సత్తి తాజాగా ‘నేనే రాజు..నేనే మంత్రి’ చిత్రం నిర్వహించిన జోగేంద్ర గర్జన కార్యక్రమంలో పాల్గొని సెలబ్రెటీలను హడలగొట్టాడు.  

 

ఈ కార్యక్రమానికి హీరో దగ్గుబాటి రానా తో పాటు హీరోయిన్లు కాజల్, కేథరిన్ తెరిసా కూడా వచ్చారు.  అయితే కాజల్ మాట్లాడుతున్న సమయంలో బిత్తిరి సత్తి ఆమెతో చేసిన సంభాషన అక్కడున్న వారందరినీ నవ్వించేలా చేశాయి.  కానీ కాజల్ కి మాత్రం చుక్కలు కనిపించాయి.  హలో మేడమ్ అయామ్ ఆస్కింగ్ యూ..కాజల్ మీరు తెలుగులో చెప్పండి నాకు అర్థమైంది..అని అనడంతో నీకేం అర్థమైంది..అసలు నేనేం చెప్పాను.

 

నేనేమీ అడగక ముందే అర్థమైందని అంటున్నావ్..అసలు నీకు తెలుగు రాదని నాకర్థమైందని అనడంతో కాజల్ ఖంగు తిన్నంది. మీరు మద్య మద్యలో విటమిన్ సాంగ్ (ఐటమ్ సాంగ్)  లు ఎందుకు చేస్తున్నారూ..ఈ సినిమాల కూడా విటమిన్ సాంగ్ ఏదైనా ఉందా..అనడంతో మొదట విటమిన్ సాంగ్ అంటే కాజల్ కీ అస్సలు అర్థం కాలేదు..అసలు విషయం తెలుసుకున్న తర్వాత నవ్వుతూ అబ్బే ఈ సినిమాలో అలాంటిది ఏదీ లేదని చెప్పారు.

ఈ సినిమాలో రాధ పాత్ర మాత్రమే కనిపిస్తుందని కాజల్ జవాబు చెప్పింది.  ఇదే సమయంలో హీరో దగ్గుబాటి రానా వచ్చి బిత్తిరి సత్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios