MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • SS Rajamouli: రాజమౌళి కి హాలీవుడ్‌ ఆఫర్‌, తన డ్రీమ్‌ నెరవేరబోతుందా?.. జక్కన్న ఏం చెప్పాడంటే?

SS Rajamouli: రాజమౌళి కి హాలీవుడ్‌ ఆఫర్‌, తన డ్రీమ్‌ నెరవేరబోతుందా?.. జక్కన్న ఏం చెప్పాడంటే?

'ఆర్ఆర్ఆర్' హిట్ తర్వాత రాజమౌళి కి హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయట. కానీ, ప్రస్తుతం మహేష్ బాబుతో తీస్తున్న 'వారణాసి' సినిమాపైనే జక్కన్న పూర్తి ఫోకస్ పెట్టారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 24 2026, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాజమౌళి కి హలీవుడ్‌ ఆఫర్‌
Image Credit : youtube/@ScreenRantPlus

రాజమౌళి కి హలీవుడ్‌ ఆఫర్‌

రాజమౌళి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 'బాహుబలి' సిరీస్‌తో ఇండియన్ సినిమా రేంజ్‌ను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఆయన.. 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ స్టేజ్‌పై భారతీయ సినిమా సత్తా చాటారు.

ఇప్పుడు రాజమౌళి తర్వాతి సినిమా 'వారణాసి'పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ గ్యాప్‌లో హాలీవుడ్ నుంచి తనకు చాలా ఆఫర్లు వచ్చాయని జక్కన్న చెప్పడం ఆసక్తిగా మారింది. అంతేకాదు, 'వారణాసి' షూటింగ్ గురించి కూడా ఆయన ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది- రాజమౌళి
Image Credit : X

హాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది- రాజమౌళి

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత రాజమౌళి హాలీవుడ్‌లో సినిమా చేస్తారా అనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా రాజమౌళి బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ ఎంట్రీపై ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు. అక్కడి ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో సినిమా డైరెక్ట్ చేయాలనే కోరిక తనకు కూడా ఉందని చెప్పారు.

ప్రపంచంలోని చాలా మంది డైరెక్టర్ల లాగే తనకు కూడా హాలీవుడ్‌లో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని బలంగా ఉందన్నారు. అక్కడి వర్క్ కల్చర్, ప్రొడక్షన్ సిస్టమ్, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. హాలీవుడ్ ప్రొడక్షన్ స్టైల్‌లో పనిచేయడం తనకు ఇష్టమేనని రాజమౌళి స్పష్టం చేశారు.

34
హాలీవుడ్‌ ఆఫర్లు.. రాజమౌళి రియాక్షన్‌ ఇదే
Image Credit : X

హాలీవుడ్‌ ఆఫర్లు.. రాజమౌళి రియాక్షన్‌ ఇదే

'ఆర్ఆర్ఆర్' సినిమా గ్లోబల్ లెవెల్‌లో హిట్ అయ్యాక హాలీవుడ్ నుంచి తనకు చాలా ఆఫర్లు వచ్చాయని రాజమౌళి రివీల్ చేశారు. అందులో కొన్ని అవకాశాలు ఇంకా ఓపెన్‌గానే ఉన్నాయని చెప్పారు.

కానీ, ఆ టైమ్‌లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'వారణాసి' సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఆయన పూర్తిగా బిజీగా ఉన్నారట. ఒకేసారి రెండు వేర్వేరు సినిమాలపై ఫోకస్ చేయడం తన వల్ల కాదని ఆయన తేల్చి చెప్పారు.

ఒక పని పూర్తిగా అయిపోయాకే మరో పని గురించి ఆలోచించడం తన అలవాటు అని చెప్పారు. అందుకే అప్పట్లో హాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను పక్కన పెట్టాల్సి వచ్చిందని రాజమౌళి వివరించారు.

44
'వారణాసి' పై బిగ్ అప్‌డేట్
Image Credit : Asianet News

'వారణాసి' పై బిగ్ అప్‌డేట్

ప్రస్తుతం రాజమౌళి పూర్తి ఫోకస్ అంతా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'వారణాసి' సినిమాపైనే ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

రాజమౌళి ఈ సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ.. మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ఇంకా కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పారు. ఇండియన్ మైథాలజీ, అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కలయికతో ఈ సినిమా రాబోతోందని చెప్పారు.

'వారణాసి' సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా పనులు పూర్తయ్యాకే హాలీవుడ్ ప్రాజెక్ట్‌లపై ఆయన ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. హాలీవుడ్‌లో సినిమా చేయాలనే కలను రాజమౌళి వదులుకోలేదు. కానీ, ప్రస్తుతానికి ఆయన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం 'వారణాసి' సినిమానే. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Simbu Marriage Prediction: శింబు పెళ్లిపై జ్యోతిష్యురాలు సంచలన కామెంట్స్.. అభిమానుల్లో ఆందోళన
Recommended image2
Fauzi Teaser: ప్రభాస్ వింటేజ్ లుక్ అదిరింది.. సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ స్పైగా డార్లింగ్!
Recommended image3
Garividi Lakshmi 7 Days Collections: గరివిడి లక్ష్మి మూవీకి హిట్‌ టాక్‌, కలెక్షన్లు మాత్రం రివర్స్.. కారణం ఇదే
Related Stories
Recommended image1
Top 10 Heroes: దుమ్మురేపిన అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌కి మళ్లీ దెబ్బ.. ప్రభాస్‌, మహేష్‌, చరణ్‌ స్థానాలివే
Recommended image2
Top 10 Heroines: టాప్‌కి దూసుకొచ్చిన రష్మిక, పడిపోయిన సాయిపల్లవి, నయనతార.. సమంత, కాజల్‌, త్రిష స్థానాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved