MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Naresh: 15 ఏళ్లు సినిమాలకు దూరం, రాజకీయాల వల్ల సొంత ఆస్తులు పోగొట్టుకున్న హీరో, నరేష్ సంచలన కామెంట్స్

Naresh: 15 ఏళ్లు సినిమాలకు దూరం, రాజకీయాల వల్ల సొంత ఆస్తులు పోగొట్టుకున్న హీరో, నరేష్ సంచలన కామెంట్స్

Naresh: సినిమాల్లో మంచి ఫామ్ లో ఉండగానే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సీనియన్ యాక్టర్ నరేష్. ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తే.. ఆస్తులు అమ్ముకోవాల్సివచ్చిందంటూ నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 24 2026, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నరేష్ షాకింగ్ కామెంట్స్..
Image Credit : Asianet News

నరేష్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్‌లో తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు నరేష్ తాజాగా రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, అయితే ఆ నిర్ణయం తన వ్యక్తిగత , ఆర్థిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల కారణంగా తాను సంపాదించిన ఎన్నో ఆస్తులను కోల్పోవాల్సి వచ్చిందని నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

రాజకీయ ప్రవేశం - సినిమాలకు దూరం

ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో వరుస విజయాలతో యువ హీరోగా దూసుకుపోయిన నరేష్.. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఊహించని విధంగా రాజకీయ రంగ ప్రవేశం చేసారు. ఈ క్రమంలో ఆయన సుమారు 15 సంవత్సరాల పాటు వెండితెరకు, సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సి వచ్చింది. సినిమాల ద్వారా వచ్చే ఆదాయం నిలిచిపోవడం , రాజకీయ పార్టీ కార్యకలాపాలు, ప్రజా సేవ కోసం సొంత నిధులను భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పార్టీ కార్యక్రమాల కోసం ఆస్తుల అమ్మకం..
Image Credit : our own

పార్టీ కార్యక్రమాల కోసం ఆస్తుల అమ్మకం..

రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి, ప్రజలతో మమేకం కావడానికి తన సొంత ఆస్తులను విక్రయించాల్సి వచ్చిందని నరేష్ స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను సంపాదించిన డబ్బు, ఇల్లు, భూముల వంటి స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టి ఉంటే నేడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని ఆయన అన్నారు. రాజకీయ రంగంలోని ఆర్థిక ఒత్తిళ్లు, వాటి వల్ల ఎదురైన చేదు అనుభవాలను ఆయన గుర్తుచేసుకున్నారు.

33
మంచితనమే కొంపముంచిందా?
Image Credit : social media

మంచితనమే కొంపముంచిందా?

తన జీవితంలో ఎదురైన ఆర్థిక నష్టాలకు రాజకీయాలతో పాటు తనలో దాన గుణం కూడా ఒక కారణమని నరేష్అన్నారు. తన దగ్గరకు ఎవరైనా కష్టాల్లో ఉన్నామని వస్తే, తమ స్థాయికి మించి సహాయం చేసేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. "జేబులో పది వేల రూపాయలు ఉంటే.. ఎక్కడి నుంచో తెచ్చి మరీ పదిహేను వేలు ఇచ్చేసే మనస్తత్వం నాది" అని పేర్కొంటూ, ఆ సమయంలో ఇతరులకు సాయం చేసే క్రమంలో తాను చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించారు.

మొత్తానికి, ఒక వెలుగు వెలిగిన అగ్ర హీరో రాజకీయాల వైపు అడుగులు వేసి, ఆ తర్వాత ఎదుర్కొన్న ఆర్థిక ఒడిదుడుకుల గురించి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజకీయ రంగంలో రాణించాలంటే కేవలం ప్రజా ఆదరణ మాత్రమే కాకుండా, ఆర్థిక నిర్వహణ కూడా ఎంత ముఖ్యమో ఆయన అనుభవాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం నరేష్ అన్నింటికి దూరంగా ఉంటూ.. సినిమాలు చేసుకుంటున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
SS Rajamouli: రాజమౌళి కి హాలీవుడ్‌ ఆఫర్‌, తన డ్రీమ్‌ నెరవేరబోతుందా?.. జక్కన్న ఏం చెప్పాడంటే?
Recommended image2
Simbu Marriage Prediction: శింబు పెళ్లిపై జ్యోతిష్యురాలు సంచలన కామెంట్స్.. అభిమానుల్లో ఆందోళన
Recommended image3
Fauzi Teaser: ప్రభాస్ వింటేజ్ లుక్ అదిరింది.. సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ స్పైగా డార్లింగ్!
Related Stories
Recommended image1
తెలంగాణలో 6 అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రాలు, తప్పకుండా సందర్శించాల్సిన ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఇవే!
Recommended image2
1990s Food Prices: 90ల కాలంలో బియ్యం, పప్పులు వంటి సరుకుల కిలో ధరలు ఎంతో తెలిస్తే అవాక్కవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved