లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ‘మ‌హాన‌టి’ సినిమా నేడు(బుధవారం) రిలీజ్ అయింది. ఫస్ట్ షోతోనే సినిమా అద్భుతమనే టాక్‌ని సంపాదించుకుంది. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సావిత్రి నిజ‌ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కడం, సినిమాలో వివిధ భాష‌ల‌కు చెందిన ప్రముఖ న‌టులు న‌టిస్తుండ‌డంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్‌ నటించగా.. మరికొన్ని కీలక పాత్రల్లో స‌మంత‌, దుల్కర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ తదితరులు నటించారు.
 
అయితే ఈ సినిమాలో మ‌రో టాప్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా న‌టిస్తోందంటూ చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. ‘మ‌హాన‌టి’లో కాజ‌ల్ ఏమి చేస్తోందో తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే మే తొమ్మిదో తేదీ వ‌ర‌కు ఆగండి’ అంటూ కామెంట్ కూడా పెట్టింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఈ సినిమాలో కాజల్ లేనేలేదు. ఆమె పాత్ర ఎడిటింగ్‌లో ఎగిరిపోయిందని తెలుసుకుని ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.