- Home
- Entertainment
- Padma Awards 2026: మమ్ముట్టికి పద్మభూషణ్, ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. రొమాంటిక్ హీరోకి కూడా అవార్డు
Padma Awards 2026: మమ్ముట్టికి పద్మభూషణ్, ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. రొమాంటిక్ హీరోకి కూడా అవార్డు
Padma Awards 2026: మలయాళ నటుడు మమ్ముట్టికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. అదేవిధంగా ధర్మేంద్రకి పద్మ విభూషణ్, ఆర్ మాధవన్ కి పద్మ శ్రీ ప్రకటించారు.

పద్మ అవార్డులు 2026
భారతదేశంలో కళ, సామాజిక సేవ, సాహిత్యం, విద్య, క్రీడలు, సైన్స్, ఇంజనీరింగ్‌తో సహా వివిధ రంగాలలో రాణించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రదానం చేస్తుంది. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందిస్తున్నారు.
మమ్ముట్టికి పద్మభూషణ్
కేరళ చిత్ర పరిశ్రమ సూపర్ స్టార్, నటుడు మమ్ముట్టికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. మమ్ముట్టి దశాబ్దాలుగా తన నటనతో మలయాళీ సినీ ప్రేక్షకులను, ఇండియన్ సినిమా ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే.
రొమాంటిక్ హీరోకి పద్మశ్రీ
ఒకప్పటి రొమాంటిక్ బాయ్, ప్రేమ కథా చిత్రాల హీరో ఆర్ మాధవన్ కి భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది. మాధవన్ ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన నటనతో అలరిస్తున్నారు.
ధర్మేంద్రకి పద్మ విభూషణ్
బాలీవుడ్ దివంగత నటుడు ధర్మేంద్రకి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. కొన్ని నెలల క్రితం ధర్మేంద్ర మరణించిన సంగతి తెలిసిందే.

