బెట్టు తగ్గించిన కాజల్ అగర్వాల్.. శర్వా సరసన ఓకే..

First Published 27, Nov 2017, 6:04 PM IST
kajal agarwal agreed to work with sharwanand
Highlights
  • తెలుగులో దశాబ్దానికి పైగా ఏలుతున్న కొద్దిమంది హిరోయిన్లలో కాజల్
  • తాజాగా యంగ్ హీరో శర్వానంద్ సరసన హిరోయిన్ గా కాజల్ అగర్వాల్
  • సితార ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వా సరసన కాజల్

 

తెలుగు ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్న కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి లాంటి టాప్ హీరో సరసన కూడా నటించింది. రీసెంట్ గా హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. ఇలాంటి నేపథ్యంలో... కాజల్ కు రెండోసారి కూడా మెగాస్టార్ సరసన ఆఫర్ వచ్చింది. అయితే.. సైరా లాంటి ప్రతిష్టాత్మక చిత్రమే అయినా.. చిరుతో సినిమా చేసేందుకు నిరాకరించిందంటూ... ఆ మధ్య వార్తలు బాగానే స్ప్రెడ్ అయ్యాయి. ఆల్రెడీ నయన్ లీడ్ రోల్ చేస్తున్న నేపథ్యంలో తాను తక్కువ నిడివి గల పాత్ర చేయనంటూ నిరాకరించిందని... అయినా పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేస్తే తనకు యంగ్ హీరోల సరసన అవకాశాలు సన్నగిల్లుతాయనే నెపంతో కాజల్ బెట్టు చేసిందని వినిపించింది.

 

యంగ్ హీరో శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్లో ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రానుంది. విభిన్న పాత్రలో శర్వానంద్ నటించనున్నాడు. ఇవాళే అధికారికంగా ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం తమన్నా, కాజల్, షాలిని పాండే, నిత్యామీనన్, నివేతా థామస్ లాంటి హిరోయిన్లలో ఇద్దరిని అనుకున్నారు. వచ్చే జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

ఈ మూవీలో ఓ హిరోయిన్ గా మేకర్స్ కాజల్ ను ప్రిఫర్ చేసినా.. డేట్స్ కుదరక సినిమాకు దూరమైంది. దీంతో సినిమా గత కొంత కాలంగా ఆలస్యమైంది. అలా తన డేట్స్ అడ్జస్ట్ కావటంటో కాజల్ హిరోయిన్ గా ఓకే అంది. దీంతో మేకర్స్ కూడా చాలా సంతోషంగా ఫీలవుతున్నారు. ఈ సినిమాలో కాజల్ తో పాటు మరో హిరోయిన్ గా.. నిత్యామీనన్ నటించనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ పై తెరకెక్కనున్న ఈ మూవీ జనవరిలో పట్టాలెక్కనుంది. మొత్తానికి డేట్స్ కుదరవని చెప్పిన కాజల్ తిరిగి శర్వానంద్ సరసన ఓకే అనటంతో మేకర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

loader