జైలవకుశ సినిమా సూపర్ హిట్ తో 2017లో ఫుల్ జోష్ లో వున్న ఎన్టీఆర్ కు.. 2018వ సంవత్సరం కూడా మరో మరుపురాని సంవత్సరంగా మిగిలిపోబోతోందని సమాచారం. ఈ యేడాది అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాలతోనే కాక.. ఆయన నిజ జీవితంలోనూ మరుపురాని క్షణాలను ఆస్వాదించబోతున్నారట. 

 

విశేషమేంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మళ్లీ తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. తారక్‌-ప్రణతి దంపతులకు 4ఏళ్ల అభయరామ్‌ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. మే నెలలో వీరి కుటుంబంలోకి మరొకరు రాబోతున్నారని సమాచారం. ఈ విషయంమై సోషల్‌మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.

 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం తివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆయన రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే మల్టీస్టారర్‌లోనూ నటించబోతున్నారు. ఇందులో మరో కథానాయకుడిగా రామ్‌చరణ్‌ నటిస్తు్న్నారు. మే నుంచి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అవుతుందని అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ కు ఈ ఏడాది ఓ ప్రత్యేక సంవత్సరంగా మిలిగిపోనుంది.