జూలీ2 కథలోని ఆ హీరోయిన్ ఎవరు..ఆమె స్పందన ఏంటి?

First Published 22, Nov 2017, 3:33 PM IST
julie 2 story based on popular south heroine nagma
Highlights
  • జూలీ2 చిత్రంలో అందాల ఆరబోతకు వెనుకాడని లక్ష్మీరాయ్
  • చిత్రం నగ్మా జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా తీసారని లీకులు
  • తన పై తప్పుడు అంశాలు చూపిస్తే కోర్టుకెక్కుతానన్న నగ్మా

జూలీ2 చిత్రంలో బాలీవుడ్ లో పాగా వేయాలని ట్రై చేస్తోంది హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి. ఇండస్ట్రీలో తగిన గుర్తింపు రాకపోవడంతో ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘జూలీ 2’ మూవీ ద్వారా తిరిగి ట్రాక్ లోకి రావడానికి సాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుకే అవసరానికి మించి మరీ ఎక్స్ పోజింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ట్రై చేస్తోంది.

 

ఈ వారం విడుదల కాబోతున్న జూలీ2 ఒకప్పుడు దక్షిణాది సినిమారంగాన్ని ఒక ఊపు ఊపిన అప్పటి గ్లామర్ హీరోయిన్ నగ్మా జీవితంలోని కొన్ని డార్క్ షేడ్స్ గుర్తుకు చేసేవిధంగా ఉంటుందని ప్రచారం మొదలైంది. ఈ వార్తలను ఖండించాల్సిన జూలీ2 నిర్మాతలు, లక్ష్మిరాయ్ పనిగట్టుకుని ఈసినిమా కథలోని కొన్నిసన్నివేశాలు నగ్మా జీవితంలోని జరిగిన కొన్ని సంఘటనలకు పోలికతో ఉండటం యాదృచ్చికం అని చెప్పటంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.

 

నగ్మా పేరు సడెన్ గా తెరపైకి రావటంతో సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వచ్చిన ‘డర్టీ పిక్చర్’ తరహాలో ఈసినిమాలో కూడ ఏమైనా సంచలనాలు ఉంటాయా అంటూ మూవీపై అటెన్షన్ పెరిగిపోతోంది. ఈసినిమాకు సంబంధించి లీగల్ సమస్యలు రాకుండా వ్యూహాత్మకంగా ఈసినిమా నిర్మాతలు అన్యాపదేశంగా నగ్మా వ్యక్తిగత జీవితాన్ని బేస్ చేసుకుని ఈసినిమా తీసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

 

నైంటీస్ లో సౌత్ ఇండస్ట్రీని ఉర్రూతలూగించిన నగ్మా అప్పట్లో పెళ్లయిన ఒక సూపర్ స్టార్ తో ఎఫైర్ పెట్టుకుందన్న వార్తలు అప్పటి రోజులలో మీడియాకు హాట్ టాపిక్ గా వుండేవి. ఈకారణంతో ఆమెను సౌత్ నుంచి ఎలా పంపించేశారు, ఆ తరువాత ఆమె భోజ్ పురిలో ఎలా స్టార్ అయి మళ్లీ నిలదొక్కుకుంది అనే అంశాలు ఈసినిమాలో యదార్ధంగా తీసినట్లు వార్తలు వస్తున్నాయి.

 

‘జూలీ-2’ సమర్పకుడు పహ్లాజ్ నిహ్లానీ కూడ ఇన్ డైరెక్ట్ గా నగ్మా గురించి చెప్తూ లీకులు ఇస్తున్నాడు. అయితే ఈవిషయాలు నగ్మా దృష్టికి జాతీయమీడియా తీసుకు వెళ్ళడంతో... సెన్సేషన్ క్రియేట్ చేయటానికి ఈసినిమా దర్శక నిర్మాతలు తన పేరును వాడుకుంటున్నారనే అనుమానం కలుగుతోందని... ఈ సినిమా విడుదల అయ్యాక ఈ సినిమాలో తనను టార్గెట్ చేసినట్లుగా అభ్యంతర సన్నివేశాలు ఉంటే న్యాయపోరాటం చేస్తానని నగ్మా అంటోంది.

loader