నందమూరి వంశంలో మరో వారసుడు జన్మించాడు. జూనియర్ ఎన్టీఆర్ కు రీసెంట్ గా ఓ బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా అభిమానులతో పంచుకున్నాడు తారక్. బిడ్డ పుట్టిన కొన్ని గంటల్లోనే అతడి ఫోటో ఆన్ లైన్ లో లీక్ అయింది. అయితే ఈ ఫోటో ఫేక్ అనే కామెంట్లు వినిపించాయి. కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ తన చిన్న తమ్ముడిని ఎత్తుకొని ఉండగా ఆ ఫోటోని తీసే ప్రయత్నం చేశాడు తారక్.

ఆ ముగ్గురిని కాప్చర్ చేస్తూ ప్రణతి తీసిన ఫోటో ఆన్ లైన్ లో వైరల్ అయింది. అయితే ఈసారి ఎన్టీఆర్ స్వయంగా తన కొడుకుతో దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఉంచారు. తన రెండో కొడుకుకి పేరు పెడుతున్న సందర్భంగా కుటుంబం మొత్తం ఒక ఫోటోను తీసుకున్నారు. మొదటి కొడుకికి అభయ్ రామ్ అని పేరు పెట్టగా, రెండో బిడ్డకు భార్గవరామ్ అని పేరు పెట్టాడు. ఈ ఫోటోని చూసిన అభిమానులు తారక్ కు శుభాకాంక్షలు చెబుతూ 'భార్గవ్ రామ్'కు తమ ఆశీర్వాదాలు అందిస్తున్నారు.  

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో నటిస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో తారక్ సిక్స్ ప్యాక్ తో సరికొత్త లుక్ తో కనిపించబోతున్నాడు. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

 

The little one is, #BhargavaRam #NamingCeremony #FamilyTime #Bratpack

A post shared by Jr NTR (@jrntr) on Jul 3, 2018 at 11:20pm PDT