RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ మాస్ సాంగ్.. ‘నాటు’ కాపీయా... ?
తెలుగు సినిమా స్థాయిని ఎల్లలు దాటించిన రాజమౌళి సినిమాలపై ఎప్పుడు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. బాహుబలి సినిమా సమయం నుండి మరింత ఎక్కువయ్యాయి. బాహుబలి సినిమాలోని చాలా సన్నివేశాలు హాలీవుడ్ నుండి కాపీ కొట్టాడంటూ ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిని పెద్దగా పట్టించుకోలేదు జక్కన్న
గత కొద్ది రోజులుగా రెస్టారెంట్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్, సెలూన్స్.. ఇలా ఎక్కడా విన్నా.. ఒకటే పాట. అలాగే ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా ఎందులో చూసినా ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటే స్టెప్స్ వీడియోలే. అదిరిపోయే మ్యూజిక్ కి తోడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల డ్యాన్స్ మేనియా దుమ్మురేపుతోంది! ఈ ఇద్దరితో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రంలోని పాట ఇది. నవంబరు 10న విడుదలై అతి తక్కువ సమయంలోనే రికార్డు క్రియేట్ చేస్తోంది. చరణ్, తారక్ కలిసి ‘నాటు నాటు’ అనే బీట్‌కి అదిరిపోయే స్టెప్పులేసి యావత్ సినీ అభిమానుల్ని ఉర్రూతలూగించారు. తమ వేగంతో అందరినీ ఆశ్చర్యపర్చటంతో వైరల్ అయ్యింది. అయితే అదే సమయంలో ఈ సాంగ్ ఓ ఆఫ్రికన్ సాంగ్ కు పోలిక ఉందని, స్టెప్స్ కు దగ్గరగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
యాంటీ ఫ్యాన్స్ ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. Masaka Kids Africana Dancing పేరుతో ఉన్న వీడియోని షేర్ చేస్తూ పోలిక చూసుకోండి అంటన్నారు. ఆఫ్రికన్ సాంగ్ లో కూడా ఇద్దరు నటులు ఇదే రకంగా కాస్ట్యూమ్స్ వేసుకుని ఒకే తీరున స్టెప్స్ వీర లెవెల్లో వేస్తారని చెప్తున్నారు. అయితే ఇది ప్రేరణ అయ్యిండవచ్చు కానీ అదీ ఒకటి కాదనేది నిజం. ఇది కాపీ అని చెప్పటానికి రాజమౌళి గతంలో నానితో చేసిన ఈగకు కాక్రూచ్ మూలం అనే విషయం, బస్టర్ కీటన్ స్వీయదర్శకత్వంలో నటించిన ‘అవర్‌హాస్పిటాలిటీ’ సినిమాకు రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన ‘మర్యాదరామన్న కాపీ అని గుర్తు చేస్తున్నారు.
అయితే అవన్నీ ప్రక్కన పెడితే స్తుతం ఈ పాట సౌత్ ఇండియా లో టాప్ ప్లేస్ ను చేరుకుంది. అది కూడా ఒక్క రోజులోనే 10.4 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదలైతే రికార్డుల ఎన్ని బ్రేక్ అవుతాయో అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.మరో ప్రక్క కొందరు అభిమానులు వీరిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధిత వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరికొందరికి డ్యాన్స్ చేయాలని ఉన్నా కాలు ఎలా కదపాలో తెలియక ఆగిపోతున్నారు. ఇలాంటి వారి కోసమే యూట్యూబ్ వేదికగా కొందరు పాఠాలు నేర్పుతున్నారు. ‘నాటు నాటు హుక్ స్టెప్ ట్యుటోరియల్’ పేరుతో వీడియోలు రూపొందించి చూపిస్తున్నారు.
Also read వీడియో: నాటు నాటు సాంగ్ కి బిగ్ బాస్ సోహైల్, మెహబూబ్ అదిరిపోయే స్టెప్స్
ట్రిపుల్ ఆర్ తెలుగు పరిశ్రమలో ప్రెస్టేజియస్ మూవీగా ఉంది. ట్రిపుల్ ఆర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ప్రమోషన్ వర్క్ కూడా అదిరిపోయే రేంజిలో సాగుతోంది. ట్రిపుల్ ఆర్ నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా రీసౌండ్ చేస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
Also read RRR మూవీపై తీవ్ర ప్రభావం నిజమే, కోర్టుకి వెళ్లడం లేదు.. డైరెక్ట్ గా సీఎం జగన్ తోనే..