వీడియో: నాటు నాటు సాంగ్ కి బిగ్ బాస్ సోహైల్, మెహబూబ్ అదిరిపోయే స్టెప్స్

ఆర్ ఆర్ ఆర్ సెకండ్ సింగిల్ నాటు నాటు సాంగ్ విపరీతమైన క్రేజ్ రాబట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన హై వోల్టేజ్ స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ లోని ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్స్ ని అనుకరిస్తూ వందల వీడియోలు పుట్టుకొస్తుండగా, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మెహబూబ్ సైతం తమ టాలెంట్ చూపించారు.

bigg boss fame sohail mehaboob shakes legs for rrr movie naatu naatu song

ఆర్ ఆర్ ఆర్ (RRR movie) మాస్ యాంథమ్ గా ప్రచారం అవుతుంది నాటు నాటు సాంగ్. కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్.. కి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన స్టెప్స్ అందించారు. ఇటీవల విడుదలైన లిరికల్ సాంగ్ లో ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ కలిసి కొన్ని మాస్ స్టెప్స్ ఇరగదీశారు. టాలీవుడ్ టాప్ డాన్సర్స్ గా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram charan) మెరుపు వేగంతో ఒక్కసారిగా కాళ్లు కదపగా... ఈ సాంగ్ పిచ్చ వైరల్ అయ్యింది. ఈ పాటకున్న క్రేజ్ నేపథ్యంలో పలువురు నాటు నాటు సాంగ్ లోని హీరోల స్టెప్స్ అనుకరిస్తూ కవర్ సాంగ్స్ చేస్తున్నారు. సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా తమ టాలెంట్ చూపిస్తున్నారు.

 తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మెహబూబ్ నాటు నాటు సాంగ్ (Naatu naatu song) కి తమదైన రీతిలో డాన్స్ చేశారు. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటు ధరించి ఎన్టీఆర్, రామ్ చరణ్ గుర్తుకు వచ్చేలా అద్భుతంగా స్టెప్స్ వేయడం జరిగింది. మెహబూబ్ తన యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. మెహబూబ్, సోహైల్ స్టెప్స్ అద్భుతం అంటూ లైక్స్ రూపంలో ఫ్యాన్స్ తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. 


కాగా బిగ్ బాస్ (Bigg boss) సీజన్ 4లో పాల్గొన్న సోహైల్, మెహబూబ్ మంచి మిత్రులుగా మెలిగారు. హౌస్ లో ఒకరికి ఒకరు అన్నట్లు ప్రవర్తించారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పేరు తెచ్చుకున్న సోహైల్ ఫైనల్ కి వెళ్లగా.. మెహబూబ్ దాదాపు చివరి వారాల వరకు ఉన్నాడు. ఫైనల్ లో సోహైల్ నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25 లక్షలు తీసుకొని నిష్క్రమించాడు. అందులో మెహబూబ్ ఇంటి కోసం పది లక్షలు ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే వీరి స్నేహానికి, ఆటతీరును మెచ్చిన గెస్ట్ చిరంజీవి, మెహబూబ్ కి పదిలక్షలు ఇవ్వడం జరిగింది. 

Also read RRR మూవీపై తీవ్ర ప్రభావం నిజమే, కోర్టుకి వెళ్లడం లేదు.. డైరెక్ట్ గా సీఎం జగన్ తోనే..
 ఫైనల్ కి ముందు బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన మెహబూబ్.. నీది మూడవ స్థానం అని సోహైల్ కి వేళ్ళ ద్వారా హింట్ ఇచ్చాడని, అందుకే సోహైల్, నాగార్జున ఆఫర్ తీసుకొని టైటిల్ రేసునుండి తప్పుకున్నాడని విమర్శలు వినిపించాయి. ఏదిఏమైనా బిగ్ బాస్ ఫేమ్ తో సోహైల్ హీరోగా మారగా... మెహబూబ్ యూట్యూబ్ లో చెలరేగిపోతున్నాడు. 

Also read Shilpa shetty: మరో కేసులో బుక్ అయిన రాజ్ కుంద్రా... ఈసారి శిల్పా శెట్టి కూడా

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios