ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా: ఎన్టీఆర్

First Published 28, May 2018, 11:53 AM IST
Jr NTR Emotional Words About his Grand Father
Highlights

పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన నందమూరి తారకరామారావు అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యనాన్ని సృష్టించారు. తెలుగు వారి హృదయాల్లో శాశ్వతంగా.. ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవలందించారు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా.. అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళి అర్పించారు. ఆయన మనవడిగా పరిచయమయిన జూనియర్ ఎన్టీఆర్ తన నటనలో, ఆహార్యంలో తాతను గుర్తు చేస్తుంటాడు. ఎన్టీఆర్ కు తన తాత అంటే విపరీతమైన ప్రేమ. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఎన్టీఆర్ తన తాతను స్మరిస్తూ చెప్పిన కొన్ని పదాలు అభిమానుల మనసులను హత్తుకుంటున్నాయి. 

''మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది
మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది
పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..
 సదా మీ ప్రేమకు బానిసను'' అంటూ తారక్ ఎమోషనల్ అయ్యాడు. 

loader