జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటినుండే సినిమా బిజినెస్ ను మొదలుపెట్టారు. ఆంద్రప్రదేశ్ లో ఏరియాల వారిగా అమ్మకాలు మొదలుపెట్టారు. తూర్పు. పశ్చిమ, నెల్లూరు జిల్లాల్లో రేట్లు ఫైనల్ చేసేశారు. కానీ వైజాగ్ వచ్చేసరికి సమస్య మొదలైంది.

ఇదే బ్యానర్ లో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా వైజాగ్ ఏరియాను మంత్రి గంటా శ్రీనివాసరావు అల్లుడు ప్రశాంత్ కు అమ్మారు. ఆ సినిమా కారణంగా ఆయనకు రూ.5 కోట్ల నష్టం వచ్చింది. దీంతో అందులో సగం డబ్బుని నిర్మాత తిరిగి ఇచ్చేశారు. మిగిలిన డబ్బుని భర్తీ చేయడం కోసం ప్రశాంత్ 'అరవింద సమేత' హక్కులను తనకు ఇవ్వమని అడుగుతున్నట్లు తెలుస్తోంది.

కానీ నిర్మాతలు మాత్రం 'అరవింద సమేత', 'శైలజారెడ్డి' కలిపి రూ.11 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ బయటకి మాత్రం వైజాగ్ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు. ఇప్పుడు విషయం బయటపెడితే మళ్లీ నిర్మాతలకు 'అజ్ఞాతవాసి' బయ్యర్ల మధ్య క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అజ్ఞాతవాసి బయ్యర్లకు ఈ సినిమా హక్కులు ఇస్తే రేట్ తగ్గించి ఇవ్వాల్సి వస్తుందని నిర్మాతలు ఈ విధంగా చేసి ఉంటారని టాక్.