రాజమౌళి కథలో.. ఎన్టీఆర్, చరణ్ ల పాత్రలివే!

First Published 1, Jun 2018, 5:54 PM IST
Jr NTR and Ram Charan to play brothers in rajamouli film
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే.. ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం మెగా నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో చరణ్, తారక్ ఎలాంటి పాత్రలో పోషించబోతున్నారనే విషయంలో చాలా వార్తలు వినిపించాయి. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. సినిమాలో చరణ్, ఎన్టీఆర్ లు సోదరులుగా కనిపించనున్నారట. 

చరణ్ పోలీస్ ఆఫీసర్ కాగా, తారక్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని అంటున్నారు. వీరిద్దరి ప్రొఫెషన్స్ ఆధారంగా కథను నడిపిస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. 

loader