ప్రభాస్ కు బాలీవుడ్ హీరోల్లో ఫ్యాన్స్ బాహుబలి మూవీతో అమాంతం పెరిగిన ఇమేజ్ బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ప్రభాస్ కు భారీగా అభిమానులు
బాహుబలి చిత్రం ప్రభాస్ బాలీవుడ్ లో ఓవర్ నైట్ సూపర్ హీరోని చేసింది.అల్టిమేట్ స్టార్ డమ్ ను అందించింది. ఇప్పుడు రెండవ భాగం వస్తోంది అంటే టాలీవుడ్ ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులే ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ధూమ్ 4 కోసం మొదట ప్రభాస్ నే సంప్రదించారనే టాక్ కూడా ఉంది.ఈ దశలో ఫోర్స్ 2 ప్రమోషన్ లో జాన్ అబ్రహం టాలీవుడ్ లో తన కు నచ్చిన నటుడు ప్రభాస్ అని చెప్పడం బీటౌన్ లో పెరుగుతున్న ప్రభాస్ స్టార్ డమ్ ను చెప్పకనే చెప్పింది.
బాహుబలి చిత్రం తర్వాత తెలుగులో ప్రభాస్ నటించిన చిత్రాలు హిందీలోకి డబ్ అయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో రికార్డ్ హిట్స్ అందుకుంటున్నాయి. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే... ప్రభాస్ బాహుబలి 2 చిత్రం తర్వాత తెలుగు, తమిళ , హిందీ బాషల్లో తన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రన్ రాజా రన్ దర్శకుడు ఈ చిత్రాన్ని 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు, సినిమాలో ప్రభాస్ యాక్షన్ లుక్ లో కనిపిస్తాడట.
