సారా ఆలీ ఖాన్, జాహ్నవి ఇద్దరూ మంచి స్నేహితులే కేదార్ నాథ్ అనే చిత్రంతో డెబ్యూ ఇచ్చేందుకు సైన్ చేసిన సారా సారా నటించాల్సిన కరణ్ చిత్రంలో జాహ్నవి కపూర్ ఓకే అయిందని టాక్ 

కరణ్‌ జోహార్‌ నిర్మించనున్న ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమా ద్వారా సైఫ్‌ అలీఖాన్, అమృతాసింగ్‌ కుమార్తె సారా అలీఖాన్ నాయికగా పరిచయమవుతుందని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే ఆమె ‘కేదార్‌నాథ్‌’ అనే సినిమాలో నటించేందుకు సంతకం చేసేసింది. అభిషేక్‌ కపూర్‌ డైరెక్ట్‌ చేసే ఈ చిత్రంలో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుట్‌ హీరో.

తాజాగా కరణ్‌ జోహార్‌ సినిమాలో నాయికగా శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ ఎంపికైందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ధర్మా ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ ద్వారా పరిచయమైతే జాన్వీకి లభించే ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ సినిమాలోని కేరక్టర్‌కు ఆమెను ప్రిపేర్‌ చేయించడం కోసం ఓ ప్రత్యేక బృందాన్ని కరణ్‌ నియమించేశాడని కూడా ప్రచారం జరుగుతోంది..

టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించే ఈ సినిమాకు పునీత మల్హోత్రా దర్శకుడు. ఇక ఆసక్తిరరమైన అంశం ఏంటంటే జాన్వి, సారా.. ఇద్దరూ మంచి స్నేహితులు. పార్టీలకూ, షికార్లకూ కలిసి తిరుగుతుంటారు. లేటెస్ట్ గా ఓ బ్యూటీ సెలూన్ నుంచి బయటకు వస్తూ ఈ బ్యూటీలు కెమెరాకు దొరికిపోయారు. మంచి అంచనాలే ఉన్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తమ తొలి చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తారో.