నేనే ప్రధానమంత్రి అవుతా అనిపిస్తోంది: జాన్వీ కపూర్

jhanvi kapoor latest funny video
Highlights

రీసెంట్ గా ఆమెను మనకు కాబోయే ప్రధాని ఎవరూ అని అడిగారు. ఈ ప్రశ్నకు ఫన్నీగా సమాధానమిస్తూ.. నాకైతే నేనే ప్రధానమంత్రి అవుతా అనిపిస్తోంది అని చెప్పింది. వెంటనే నాలుక కరుచుకొని ఈ విషయం మాత్రం రాయొద్దు అంటూ నవ్వేసింది.

దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తాను ప్రధానమంత్రి అవుతా అంటోంది. అదేంటి ఇప్పుడే కదా హీరోయిన్ గ ఎంట్రీ ఇవ్వబోతుంది అప్పుడే రాజకీయాల్లోకి కూడా వెళ్తుందా..? అనుకుంటున్నారా..? . అసలు విషయంలోకి వస్తే.. జాన్వీ నటించిన 'దఢక్ ' సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది జాన్వీ.

ఈ క్రమంలో తన కోస్టార్ ఇషాన్ కట్టర్ తో కలిసి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. రీసెంట్ గా ఆమెను మనకు కాబోయే ప్రధాని ఎవరూ అని అడిగారు. ఈ ప్రశ్నకు ఫన్నీగా సమాధానమిస్తూ.. నాకైతే నేనే ప్రధానమంత్రి అవుతా అనిపిస్తోంది అని చెప్పింది. వెంటనే నాలుక కరుచుకొని ఈ విషయం మాత్రం రాయొద్దు అంటూ నవ్వేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.

జాన్వీ ఇలా ప్రధాని అవుతా అని చెప్పడం, ఇషాన్-జాన్వీ లకు ఎదురైన ఫన్నీ క్వశ్చన్స్  నెటిజన్లకు చాలా సరదాగా అనిపించి వారు కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ జాన్వీపై ఫన్నీ కామెంట్స్ విసురుతున్నారు. ఇటీవల విడుదలైన 'దఢక్ ' సినిమా ట్రైలర్ 'జింగాట్' అనే పాటకు ప్రేక్షకాదరణ దక్కాయి. సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. 'సైరత్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 

 

loader