టాలీవుడ్ లో శ్రీదేవి కూతురు.. ఏ హీరోతోనో..?

First Published 24, Jul 2018, 1:38 PM IST
jhanvi kapoor gets ready for south entry
Highlights

శ్రీదేవికి తెలుగులో ఉన్న గుర్తింపును బట్టి జాన్వీకి ఇక్కడ మంచి క్రేజ్ దక్కడం ఖాయం. అయితే స్టార్ హీరో, డైరెక్టర్, మంచి బ్యానర్ ఇలా అన్నీ సరిగ్గా కుదిరే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'దఢక్' చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. తొలి సినిమాలో జాన్వీ తన నటనతో ఆకట్టుకుందని అంటున్నారు. మొదటిరోజు ఎనిమిదిన్నర కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

నిజానికి జాన్వీ అరంగేట్రం తెలుగు సినిమాతోనే చేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ ఆఫర్ కాస్త బాలీవుడ్ కు వెళ్లింది. ఇప్పుడు సౌత్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. శ్రీదేవికి తెలుగులో ఉన్న గుర్తింపును బట్టి జాన్వీకి ఇక్కడ మంచి క్రేజ్ దక్కడం ఖాయం. అయితే స్టార్ హీరో, డైరెక్టర్, మంచి బ్యానర్ ఇలా అన్నీ సరిగ్గా కుదిరే విధంగా ప్లాన్ చేస్తున్నారు. 'దఢక్' సినిమా రిలీజ్ కాకముందు నుండే జాన్వీకపూర్ ను తమ సినిమాలో హీరోయిన్ గా కొందరు టాలీవుడ్ దర్శకులు ప్రయత్నించారు.

కానీ ఆమె తండ్రి బోణీకపూర్ మాత్రం సినిమా రిలీజ్ వరకు ఆగమని చెప్పినట్లు టాక్. ఇప్పుడు సినిమా రిజల్ట్ వచ్చేసింది కాబట్టి ఇక ఆమెను టాలీవుడ్ చిత్రాల్లోకి దింపడం ఖాయమని అంటున్నారు. 

loader