ఇషాన్ తో జాన్వీ కపూర్ లిప్ లాక్.. 'ధడక్' ట్రైలర్ టాక్!

First Published 11, Jun 2018, 1:19 PM IST
jhanvi kapoor dhadak movie trailer talk
Highlights

దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కానున్న 

దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈరోజు సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. 'సైరత్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కథను బాలీవుడ్ కు తగ్గట్లు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. 

ట్రైలర్ ను మాత్రం చాలా కలర్ ఫుల్ గా కట్ చేశారు. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి నిరుపేద అబ్బాయిని ప్రేమిస్తే ఏం జరుగుతుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. దర్శకుడు శశాంక్ ఈ కథను ఎంతో అందంగా తీర్చిదిద్దాడనిపిస్తుంది. జాన్వీ కపూర్, ఇషాన్ లు ఇద్దరూ అనుభవం ఉన్న ఆర్టిస్ట్ ల మాదిరి నటించారు. వీరిద్దరి మధ్య ఓ లిప్ లాక్ ను కూడా ట్రైలర్ లో చూపించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

loader