గుణశేఖర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన జీవిత

గుణశేఖర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన జీవిత

ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డుల లిస్ట్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతునే వున్నాయి. ముఖ్యంగా గుణశేఖర్ రుద్రమదేవి సినిమాకు అవార్డు రాకపోవడాన్ని చాలా మంది సినీ ప్రముఖులు, తప్పుబడుతున్నారు. రుద్రమదేవి సినిమాకు అవార్డు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ.. గుణశేఖర్ లేవనెత్తిన  ప్రశ్నతో.. పలు ఇతర సినిమాలకు అవార్డు రాకపోవడంపైనా ప్రశ్నలు తలెత్తాయి. రుద్రమదేవికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో కనీసం మూడో ఉత్తమ అవార్డు కూడా  ఎందుకివ్వలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత జ్యూరీ పై వుందని గుణశేఖర్ ప్రశ్నించారు.

 

అంతేకాక అల్లు అర్జున్ కు కేరక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వటం ఏంటని, ఇది ముమ్మాటికీ అవమానించే కుట్రలో భాగంగా చేపట్టిన చర్య కాక మరేంటని ప్రశ్నించారు. ఇక జీవిత రాజశేఖర్ అవార్డుల  ప్రకటన అపోగానే తెలుగుదేశం సర్కారు రాక్స్ అంటూ, అడిగితే టీడీపీలో చేరతానంటూ చేసిన వ్యాఖ్యలు అనుమానించే విధంగా వున్నాయని గుణశేఖర్ వ్యాఖ్యానించారు.

 

తాజాగా గుణశేఖర్ వ్యాఖ్యలపై జీవిత స్పందించారు. రుద్రమదేవి దరఖాస్తు వచ్చిన కేటగిరీలోనే బాహుబలి చిత్రం దరఖాస్తు వచ్చిందని, రెండింటినీ పరిశీలించిన జ్యూరీ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుందని జజీవిత స్పష్టం చేశారు. అంతేకాక అల్లు అర్జున్ కు ఎస్వీ రంగారావు పేరుతో ఇచ్చే బెస్ట్ కేరక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చామని, అందుకు అతను సంతోషించాలని, గర్వపడాలని జీవిత వ్యాఖ్యానించారు.

 

మరి జీవిత వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేలా వున్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో... వివాదం మళ్లీ ఎటు దారితీస్తుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page