జీవిత రాజశేఖర్ విశ్వసనీయత కోల్పోయింది-గుణశేఖర్

First Published 18, Nov 2017, 7:43 PM IST
jeevitha rajasekhar lost her credibility says gunasekhar
Highlights
  • జీవిత రాజశేఖర్ పై విశ్వసనీయ పోయిందన్న గుణశేఖర్
  • టీడీపీలో చేరతామని రాజకీయలబ్ది కోసం మాట్లాడారన్న గుణశేఖర్
  • రుద్రమదేవికి జ్యూరీ అవార్డు కూడా ఎందుకు రాలేదో అర్థం కాలేదన్న గుణ

రుద్రమదేవి సినిమాకు నంది అవార్డు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దర్శకుడు గుణశేఖర్ మరోసారి మీడియా ముందుకొచ్చారు. తాను చెప్పిన విషయాలపై అబద్ధాలతో కమిటీ సభ్యులు స్పందిస్తున్నారని, ప్రసన్నకుమార్ లాంటి వాళ్లు అలా మాట్లాడటం సరికాదని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించమని అందరూ ఫోన్ చేసి కోరుతున్నారు. దీనికంటే ఉత్తమ చిత్రం ఏముందో నాకు అర్దం కావటంలేదన్నారు. జ్యూరీ మెంబర్ గా వున్న జీవిత రాజశేఖర్ పై.. విశ్వసనీయత కోల్పోయానంటూ... గుణశేఖర్ వ్యాఖ్యానించారు.

 

నేను సినిమా రిలీజ్ తర్వాత అప్లై చేశారని కొందరు అన్నారట,. కానీ 7అక్టోబర్ 2015 న సెన్సార్ వచ్చింది. అక్టోబర్ 8న తెలంగాణ, ఏపీ సర్కారులకు దరఖాస్తు సమర్పించాను. వాళ్లు సైన్ చేసిన అక్నాలెజ్ మెంట్ కూడా నావద్ద వుంది. అప్పటి సీఎస్ అజయ్ కల్లం దీనిపై పరిశీలించేందుకు స్క్రీనింగ్ కమిటీ నియమించాలని నోటీసు కూడా పంపారు.

 

అనంతరం తాత్సారం చేసి చేసి... మూడు నెలల తర్వాత ఫైల్ క్లోజ్ చేయమని పైనుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. తర్వాత మంత్రి అయ్యన్న పాత్రుడు గారిని వైజాగ్ లో కలిసినప్పుడు అజయ్ కల్లం చేసిన ఆదేశం గురించి అన్నారు. ఆయన స్పందించ లేదు. వదిలేశాను. మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావును గారిని కలిశాను. ఆయన కూడా నాకు కేబినెట్ సమావేశంలో అడుగుతానని తర్వాత స్పందించలేదు. ఆధారాలతో సహా నేనన్నీ నిజాలు చెప్తున్నా. ఇది నా క్రెడిబిలిటీ.

 

రుద్రమదేవి సినిమా 70-80 కోట్ల తో నిర్మించాను. తెలంగాణ ఎలా సపోర్ట్ అయిందో అలానే ఏపీ సపోర్ట్ అవుతుందని ఆలోచించాను. తప్పితే.. నేనేమీ విమర్శించలేదు. బిల్ గేట్స్ లాంటి వాళ్లతో చంద్రబాబు సాన్నిహిత్యాన్ని చూస్తే సంతోషం కలుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అంటే నాకు గౌరవం. నా వెనక ఎవరూ లేరు. నాకు జరిగిన అన్యాయాన్ని నేనే చెప్పుకుంటున్నాను.

 

పరిశ్రమలో చాలా మంది మిత్రులు మొట్టమొదటి సారి కొత్త నిబంధన పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్లై చేసేటప్పుడు మూడేళ్లు బ్యాన్ అనే నిబంధన విధించారు. గొంతు నొక్కేసిన ఫీలింగ్ కలుగుతోంది. అడిగే హక్కు లేదనటం సరికాదు. అసంతృప్తులు ఎప్పుడూ వుంటారు. విమర్శలు తీవ్రమైతే, అలాంటిదేదైనా వుంటే లీగల్ గా చర్యలు తీసుకోవచ్చు.

అసలు అవార్డుల ప్రకటన అవగానే బయటికొచ్చి రాకింగ్ అని , పార్టీలో చేరతారా అనడిగితే... చేరమంటే ఎందుకు చేరం అని జీవిత రాజశేఖర్ అన్నప్పుడు వాళ్ల మీద విశ్వసనీయత పోయింది. జ్యూరీలో మొత్తం సినిమా వాళ్లనే పెడుతున్నారు సరికాదు. రాజకీయ లబ్ది పొందాలనుకునే వాళ్లను అసలే కమిటీలో వుంచకూడదు. అవార్డుల ప్రకటన చేయగానే బయటికొచ్చి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారంటే, పారదర్శకంగా చేసినా అనుమానించాల్సి వస్తది. రాజకీయ లబ్ది కోసమే పొగుడుతున్నారని అనుకుంటారు.

 

అసలు అవార్డు కోసం పోటీ పడ్డ చిత్రాల్లో ఉత్తమ చిత్రంగా ఎంపిక కాకుంటే బై డీఫాల్ట్ రన్నరప్ అవుతుంది.  అంటే ద్వితీయ ఉత్తమ చిత్రం అవుతుంది. అలాంటిది రుద్రమదేవి జ్యూరీ అవార్డులలో కూడా పోటీపడలేక పోయిందట. మీరెందుకు స్పందించలేదు అని నన్ను కొందరు అడుగుతున్నారు. అందుకే అడుగుతున్నా. దయచేసి మీమీ రాజకీయ లబ్ది కోసం కళాకారుల కష్టాన్ని పణంగా పెట్టొద్దని కోరుతున్నా.

 

అంతేకాదు.. మొన్న అప్లై చేయటమే కేరక్టర్ ఆర్టిస్ట్ కేటగిరీలో అప్లై చేశారని ఎవరో అన్నారట. అది అబద్ధమని ప్రూవ్ చేశాను. మేమే ఎస్వీ రంగారావు గారి పేరు మీదుంది కదా అని మార్చేశాం అని అంటే ఇష్టం వచ్చినట్లు మారిస్తే సరికాదు కదా.

 

నందులకు నేషనల్ అవార్డ్స్ ను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారు. జాతీయ అవార్డుల గైడ్ లైన్స్ వేరు. నంది అవార్డుల గైడ్ లైన్స్ వేరు. దానికదే, దీనికిదే. కన్వినియంట్ గా వున్నవి కంపేర్ చేస్తున్నారు. లేనివి.. ఇది వేరు కదా అంటున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రానికి కంచెకు ఇచ్చారు. కానీ కులం గోడల్ని చీల్చిన సినిమా కంచె కాబట్టి.. నా సినిమాకు అవార్డు రాకున్నా ఫీల్ కాలేదు. కానీ ఈరోజు ఎందుకు వచ్చానంటే... నంది అవార్డు గైడ్ లైన్స్ ను బట్టి వీళ్లు అవార్డులకు ఎంపిక చేయాలి. తెలుగు జాతిని గర్వింపజేసిన రుద్రమమదేవి కథను గౌరవించకుంటే ఇంకేం లాభం. అంటూ గుణ శేఖర్ మండిపడ్డారు.

loader