Asianet News TeluguAsianet News Telugu

జయలలితకు శోభన్ బాబుతో ఉన్న సంబంధం ఏంటి...

  • శోభన్ బాబుతో కొంత కాలం ప్రేమలో పడిన జయలలిత
  • రాజకీయ భవిష్యత్తు కోసం ప్రేమను త్యాగం చేసిన అమ్మ
jayalalitha shabhanbabu relation

శోభన బాబు తెలుగు వారి గుండెల్లో ఎంతో ఎత్తులో వున్న గొప్ప నటుడు. తన అందం, ఆకర్షణతో అప్పట్లో ఎంతో మంది అమ్మాయిలకి ఆరాధ్యుడిగా ఉన్న నటుడు. కానీ శోభన్ బాబుకూ నిద్ర పట్టకుండా చేసిన అమ్మాయి ఒకరున్నారు. ఎవరో కాదు ఆమే..అలనాటి నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత.

 

సినిమాలకి వచ్చిన మొదట్లో శోభన బాబుకి అవకాశాలు నిమ్మదిగా వస్తున్నాయి. అయితే అప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒక వెలుగు వెలుగుతున్న నటి జయలలిత. అయితే నెమ్మదిగా తన హవా మొదలెట్టి చిన్నగా స్టార్ గా ఎదిగాడు శోభన్ బాబు. ఒక సినిమాలో జయని శోభన బాబు సినిమాలో నటించడానికి జయ తల్లి సంధ్యని కలవడానికి నిర్మాత వెళ్తే అందుకు ఆమె నిరాకరించారు. అయితే ఆ తరువాత ఆయన సంపూర్ణ రామాయణం, మానవుడు దానవుడు, తహసీల్దారు గారి అమ్మాయి అనే సినిమాలు చేసి తన స్టార్ డమ్ అమాంతం పెంచుకున్నాడు శోభన్ బాబు.


అయితే అప్పటికి కూడా జయలలితతో సినిమాలు తీయలేదన్న ఒక్క చిన్న కోరిక మాత్రం మిగిలిపోయింది. ‘డాక్టర్ బాబు’ సినిమాలో హీరోయిన్ దొరకకపోయేసరికి అదే అదునుగా శోభన్ బాబు.. జయతో చేద్దామని నిర్మాతకి సూచించారట. నిర్మాత వెళ్లి అడిగితే జయ అందుకు అంగీకరించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది.

 

అదే డాక్టర్ బాబు సినిమా వారిద్దరి జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తరువాత వారి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అప్పటికే పీకల్లోతు ప్రేమలో వున్నప్పటికీ శోభన్ బాబు, ఆమెకు దాసోహమయ్యాడు. ఒక దశలో జయలలిత శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలని భావించారు. అప్పటికే పెళ్ళైన శోభన్ బాబు ఆమెని రెండో భార్యగా చేసుకోవడానికి అంగీకరించారట కూడా. వాళ్లకి పెళ్లి జరిగిందో లేదో కానీ అప్పట్లో వాళ్ళకి ఒక పాప కూడా పుట్టినట్లు రూమర్లు వున్నాయి. ఆ తరువాత జయ రాజకీయాల్లో ఎంజీఆర్ శిష్యురాలిగా బిజీ అయిపోయింది.

 

అయితే జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా. వీళ్లది కూడా అంతే. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్న సమయంలోనే కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో వీరిద్దరూ పరస్పరం దూరమయ్యారు. జయని తన రాజకీయ వారసురాలిగా ప్రకటించిన ఎంజీఆర్ ఆ సమయంలో జయను చేరదీశారు. ఆ తరువాతి ఎంజీఆర్, జయల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

జయ కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం శోభన్ బాబుని దూరం చేసుకుందట. అప్పటికి రాజకీయాల్లో వున్నా.. తన కుటుంబ సభ్యులను కాదని రాజకీయ వారసురాలిగా జయని ప్రకటించారు ఎంజీఆర్. ఎంజీఆర్ వల్లే రాజకీయాల్లో జయ అంతగా ఎదిగారు. అలా ఎంజీఆర్ అండతో... తనదైన రాజకీయ చాతుర్యంతో.. వెనుదిరిగి చూడని పురచ్చి తలైవి జయలలిత.

 

చివరగా శోభన్ బాబు చనిపోయినప్పుడు కూడా ఆమె రాలేదు. కానీ శోభన్ బాబు అన్న మాట తమిళనాడు అసెంబ్లీనే కుదిపేసింది. అప్పట్లో అంతటి సున్నితమైన అంశం అది. కానీ చివరకు రాజకీయాల్లో ఎదుగుదల కోసం తన ప్రేమను కూడా త్యాగం చేసుకున్నారు జయలలిత.

Follow Us:
Download App:
  • android
  • ios