Asianet News TeluguAsianet News Telugu

సెన్సార్ పూర్తి చేసుకొన్న "జయ జానకి నాయకి"  ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 11న విడుదల !!

  • బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా  "జయ జానకి నాయక"
  • ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం "జయ జానకి నాయక"
  • సెన్సార్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 11న విడుదలకు సిద్ధమైన "జయజానకినాయక"
jayajanakinayaka sensor finished and set to release on august 11

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహించారు. 

క్లాస్-మాస్ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకొనే విధంగా దేవి తనదైన మార్క్ తో రెడీ చేసిన "జయ జానకి నాయక" ఆడియో జూలై 31న అంగరంగ వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలైన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న "జయ జానకి నాయక" సెన్సార్ నేడు పూర్తయ్యింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి "యు/ఎ" సర్టిఫికెట్ లభించింది.    

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. "ఏ విషయంలోనూ రాజీపడకుండా "జయ జానకి నాయక" చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్-గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి. ఇవాళ సెన్సార్ పూర్తయ్యింది, సినిమా చూసిన సెన్సార్ సభ్యులు "యు/ఎ" సర్టిఫికెట్ ను అందించారు. క్లీన్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "జయ జానకి నాయక" చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న పూర్తి నమ్మకం మాకుంది" అన్నారు.   

ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్,  పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!

Follow Us:
Download App:
  • android
  • ios