బుల్లితెరపై ఒకప్పటి స్టార్ హీరోయిన్!

Jaya Prada to make her television debut as lead character's mother
Highlights

నా జీవితంలో వస్తోన్న ఈ కొత్త కోణాన్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఈ అనుభవం కొత్తగా అంటుందని భావిస్తున్నాను. టీవీలో నటించడం కొత్తగా ఉంది. టీవీ అనేది ఓ పవర్ ఫుల్ మీడియా

నటిగా టాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోయిన ఒకప్పటి నటి జయప్రద ఆ తరువాత రాజకీయాల్లో బిజీ అయిపోయారు. కొంతకాలంగా పాలిటిక్స్ కు కూడా దూరంగా ఉంటోన్న ఈ నటి ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. త్వరలోనే హిందీలో రానున్న 'పర్ఫెక్ట్ పతి' అనే షోలో ఆమె నటించబోతున్నట్లు సమాచారం.

ఈ షోలో లీడ్ క్యారెక్టర్ కు తల్లి పాత్రలో జయప్రద కనిపించనున్నారు. ధైర్యవంతురాలైన, ఆధునిక మహిళగా ఆమె పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన జయప్రద.. 'నా జీవితంలో వస్తోన్న ఈ కొత్త కోణాన్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఈ అనుభవం కొత్తగా అంటుందని భావిస్తున్నాను. టీవీలో నటించడం కొత్తగా ఉంది. టీవీ అనేది ఓ పవర్ ఫుల్ మీడియా. నేను పోషిస్తోన్న పాత్ర ద్వారా సమాజంలో మరింత చైతన్యం వస్తుందని భావిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.

జయప్రద రీఎంట్రీ ఇస్తుందని తెలుగు సినిమాల్లో నటిస్తుందని గతంలో వార్తలు వినిపించినా.. ప్రస్తుతానికి మాత్రం ఆమె హిందీ టీవీ షోకి మాత్రమే పరిమితమైంది. మరి ఈ క్రమంలో సినిమా అవకాశాలు వస్తే అంగీకరిస్తుందేమో చూడాలి!

loader