క‌మ‌ల్ చేసిన ట్వీట్ పై జ‌య అభిమానుల ఆగ్ర‌హం జ‌య మృతిపై వివాద‌స్ప‌ద ట్వీట్ చేసినా క‌మ‌ల్ హ‌స‌న్ జ‌య‌ల‌లిత‌కు, క‌మ‌ల్ హాస‌న్ గ‌తంలో  విభేదాలే  కారణమా?

 అంత్య‌క్రియ‌లు కూడా పూర్తి కాకుండానే క‌మ‌ల్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం క‌రెక్ట్ కాద‌నిపిస్తుంది.జ‌య‌ల‌లిత‌కు, క‌మ‌ల్ హాస‌న్ కు గ‌తంలో విభేదాలు ఉన్నాయి. అందుచేత‌నే విశ్వ‌రూపం సినిమా టైమ్ లో క‌మ‌ల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జ‌య క‌క్ష సాధింపు వ‌ల‌నే విశ్వ‌రూపం సినిమాకు అడ్డంకులు ఏర్ప‌డ్డాయి అనే మాటలు వినిపించాయి.

 ఇంత‌కీ వీరిద్ద‌రికీ విభేదాలు రావ‌డానికి కార‌ణం ఏమిటంటే....క‌మ‌ల్ చిదంబ‌రాన్ని దృష్టిలో పెట్టుకుని పంచె క‌ట్టిన‌వాడు దేశ ప్ర‌ధాని కావాలి అన‌డంతో జ‌య‌ల‌లిత‌కు కోపం వ‌చ్చింద‌ని..అందుచేత‌నే క‌మ‌ల్ కు జ‌య‌ విశ్వ‌రూపం చూపించింద‌ని మాట‌ వినిపించింది. అయితే... దేశ ప్ర‌ధాని ఎవ‌రు ఉండాలి అని క‌మ‌ల్ నిర్ణయించ‌డు క‌దా...అలాంట‌ప్పుడు క‌మ‌ల్ పై నాకు ఎందుకు క‌క్ష సాధింపు అంటూ జ‌య‌ ఖండించింది.

ఏది ఏమైనా...ఈ టైమ్ లో క‌మ‌ల్ ఇలా ట్వీట్ చేసి ఉండ‌కూడ‌దు అనిపిస్తుంది. మ‌రి...క‌మ‌ల్ ట్వీట్ వివాదం ఎక్క‌డ వ‌ర‌కు వెళుతుందో..!