"జవాన్" కు హిట్ టాక్.. మరి కలెక్షన్స్ ఎలా వున్నాయి

First Published 2, Dec 2017, 11:54 AM IST
jawaan movie collections
Highlights
  • సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన జవాన్
  • జవాన్ మూవీకి పాజిటివ్ టాక్
  • రూ.18కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్, కలెక్షన్స్ లాంగ్ రన్ ఎలా వుంటుందో..

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్-మెహరీన్ కౌర్ జంటగా నటించిన ‘జవాన్’ మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. ‘తిక్క, విన్నర్ మూవీలు కలిసిరాకపోవడంతో.. తాజాగా రిలీజైన ‘జవాన్’ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు సాయి ధరమ్ తేజ్. బీవీఎస్ రవి దర్శకుడిగా తెరకెక్కిన జవాన్ మూవీలో రొటీన్ కథే అయినా.. డైలాగ్స్‌, సెంటిమెంట్ సీన్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరగడం ‘జవాన్’‌కు బాగా కలిసొచ్చింది. శుక్రవారం విడుదలైన అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ‘జవాన్’ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సుమారు రూ. 22 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ.. ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్స్ సాధించగా.. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లో తొలిరోజు రూ.5.5 కోట్లు గ్రాస్ వచ్చినట్లు అంచనా వేస్తున్నారు సినీ పండితులు.

 

ఇక శని, ఆదివారాలు కలిసి రావడంతో పాటు లాంగ్ రన్‌లో ‘జవాన్’ మూవీ కలెక్షన్స్ పై పాజిటివ్ అంచనాలే వున్నాయి. జవాన్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ 18 కోట్ల మార్క్ చేరింది. ఈ సినిమా 18 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ సినిమాగా, 21.6 కోట్లు వసూళ్లు సాధిస్తే సూపర్ హిట్ సినిమాగా, 27 కోట్లు వసూళ్లు సాధిస్తే.. బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది. బలమైన కథ,కథనంతో పాజిటివ్ టాక్ రావటం, మెహరీన్ గ్లామర్ కూడా సినిమాకు తోడవటం వసూళ్లపై పాజిటివ్ అంచనాలున్నాయి.

loader