రామ్ చరణ్ కోసం ఇండియాకు జపాన్ లేడీ ఫ్యాన్స్.. మెగా పవర్ స్టార్ ను చూసి ఖుషీ అయిన అభిమానులు
రామ్ చరణ్ మీద అభిమానంతో ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చారు అభిమానులు. అది కూడా లేడీ అభిమానులు మెగా పవర్ స్టార్ కోసం ఇంత దూరం వచ్చారు. గ్లోబల్ స్టార్ ను కలిసి దిల్ ఖుష్ అయ్యారు.

రామ్ చరణ్ మీద అభిమానంతో ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చారు అభిమానులు. అది కూడా లేడీ అభిమానులు మెగా పవర్ స్టార్ కోసం ఇంత దూరం వచ్చారు. గ్లోబల్ స్టార్ ను కలిసి దిల్ ఖుష్ అయ్యారు.
ప్రస్తుంతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలనంగా మారిన ఈ హీరో.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఈసినిమాలో చరణ్ నటనకు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ లాంటి దర్శకులు కూడా ఫిదా అయ్యారంటే.. చరణ్ ఇమేజ్ ఏ రేంజ్ కు వెళ్ళిందో తెలుస్తోంది. ఇక ఇండియన్ సినిమాలకు ఎక్కువగా అభిమానులు ఉండే జపాన్ లో అయితే రామ్ చరణ్ ఎంతటి స్టార్‌డమ్ ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మరీ ముఖ్యంగా RRR సినిమా ప్రమోషన్స్ సమయంలో అక్కడకి వెళ్లిన రామ్ చరణ్ కి జపాన్ అభిమానుల భారీ ఎత్తున వెల్కమ్ చెప్పారు. ఒక విదేశీ నటుడికి ఈరేంజ్ లో స్వాగతం దక్కడం అంటే.. అది మామూలు విషయం కాదు. జపాన్ లో రామ్ చరణ్ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. అప్పట్లో చరణ్ తో కలిసి వారు చేసిన సందడికి సబంధించిన ఫోటోలు, వీడియోలో తెగ వైరల్ అయ్యాయి. ఇక అది అటుఉంచితే.. రామ్ చరణ్ ను ఒక్క సారి అయినా చూడాలి అని జపాన్ అభిమానులు ఏకంగా హైదరాబాద్ కు వచ్చేశారు. తమ అభిమానుం జపాన్ లోనే ఆగిపోలేదని.. అవసరం అయితే చరణ్ కోసం అది ఇండియా వరకూ వస్తుంది అని నిరూపించారు.
తాజాగా జపాన్ కి చెందిన కొందరు లేడీ ఫ్యాన్స్ చరణ్ ని కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. సరాసరి చరణ్ ఇంటికి వెళ్లారు.. వారందర్ని సాధరంగా ఆహ్వానించిన రామ్ చరణ్ తన ఇంట్లో కలుసుకున్నారు. వారి తెచ్చిన గిఫ్ట్స్ ని రామ్ చరణ్ కి అందించారు. ఇక వచ్చిన వారందరితో రామ్ చరణ్ ఫోటోలు దిగి ఆనందపరిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక పిక్స్ చూసిన అభిమానులు.. నిజమైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక చరణ్ నెక్ట్స్ సినిమా కోసం ఎదరుచూస్తున్నట్టు అడిగారట జపాన్ అభిమానులు. త్వరలో మంచి సినిమాతో వస్తానంటూ రామ్ చరణ్ మాట ఇచ్చినట్టు సమాచారం. ఇక చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆసినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా... ఫస్ట్ సాంగ్ ను దసరా కానుకగా అఫీషియల్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.