శ్రీదేవిని గుర్తుకుతెస్తోంది

First Published 4, May 2018, 5:45 PM IST
Janhvi kapoor worn sridevi saree at national awards
Highlights

శ్రీదేవిని గుర్తుకుతెస్తోంది

ఢిల్లీలో జరిగిన 65వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. శ్రీదేవి అందుకోవల్సిన ఉత్తమ నటి అవార్డును జాన్వీ.. తన తండ్రి బోనీ కపూర్, చెల్లి ఖుషీ కపూర్‌తో కలిసి అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె కట్టుకున్న చీర ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయమైంది. 2013లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, హీరో రామ్ చరణ్ పెళ్లి సందర్భంగా కట్టుకున్న చీరనే.. జాన్వీ అవార్డు కార్యక్రమానికి ధరించినట్లు ఆమె అభిమానులు ఇన్‌స్టాగ్రమ్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా అప్పట్లో శ్రీదేవి ఆ చీరతో ఉన్న ఫొటోను, జాన్వీ ఫొటోలను పక్కపక్కనే ఉంచి పోస్ట్ చేశారు. రామ్ చరణ్ పెళ్లి కోసం శ్రీదేవి.. పింక్ లైన్ తెలుపు రంగు కంచివరం చీరను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నారని తెలిపారు. 

                      
ఈ నేపథ్యంలో శ్రీదేవి కుమార్తె కూడా తన తల్లి అడుగు జాడల్లోనే నడుస్తోందని, ఆమె జ్ఞాపకాలను సజీవం చేస్తూ.. ఆమె కట్టుకున్న చీరలోనే ప్రత్యేకంగా కనిపించడం వెనుక.. తల్లిపై జాన్వీకి ఉన్న ప్రేమ, అప్యాయతలు కనిపిస్తున్నాయని శ్రీదేవీ అభిమానులు అంటున్నారు. జాన్వీ త్వరలో ‘ధడక్’ అనే హిందీ చిత్రంతో వెండి తెరకు పరిచయం కానుంది. 

loader