వాళ్లిద్దరి మధ్య అఫైర్ నిజమేనా.?

First Published 30, Mar 2018, 3:26 PM IST
janhvi kapoor responds on the rumours about ishaan khattar
Highlights
వాళ్లిద్దరి మధ్య అఫైర్ నిజమేనా.?

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ 'ధడక్' అనే సినిమా ద్వారా హీరోయిన్‍‌గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రం ద్వారా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాహ్నవి, ఇషాన్ ఖట్టర్ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్లు ఉన్న ఈ ఫోటోలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంటర్నెట్లో వైరల్ అయిన ఫోటోల్లో ఒక దానిలో జాహ్నవి ఒడిలో ఇషాన్ ఖట్టర్ కూర్చుని ఉండటం చూసి ఇద్దరి మధ్య ఇంత క్లోజ్ నెస్ ఏమిటో అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని మరోలా అర్థం చేసుకోవద్దని, ఈ ఫోటోలో ఇతర యూనిట్ సభ్యులు కూడా ఉన్న విషయం గుర్తించాలని, షూటింగులో భాగంగానే ఇషాన్ ఆమె ఇడిలో కూర్చున్నారని చిత్ర యూనిట్ అంటోంది.

లీక్ అయిన ఫోటోలో జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ కలిసి పానీ పూరి తింటుంటారు. ఈ ఫోటో చూసిన చాలా మంది ఇద్దరూ కలిసి షూటింగ్ గ్యాపులో డేటింగుకు వెళ్లారు అని చర్చించుకుంటున్నారు. అయితే అదంతా నిజం కాదు, ఇది సినిమాలోని ఓ సన్నివేశమే..... షూటింగ్ గ్యాపులో యాక్టర్స్ బయటకు వెళ్లి రోడ్డు మీద పానీపూరీ తినేంత సీన్ ఉండదని అంటున్నారు.జాహ్నవికి ఇదే తొలి సినిమా అయినా సెట్లో ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటుందని, నటన, కష్టపడే తత్వాన్ని తల్లి శ్రీదేవి నుండి అందిపుచ్చుకుందని...... సెట్లో అందరితో ఎంతో సరదాగా ఉంటుందని పొగడ్తలు గుప్పిస్తోంది ‘ధడక్' మూవీ టీం.

loader