Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 22వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర బాధపడుతూ ఉండగా అప్పుడు జానకి ఫుల్ ఎమోషనల్ అవడంతో ఏమైంది జానకి గారు ఎందుకు అంతలా ఏడుస్తున్నారు అని అడుగుతాడు రామచంద్ర. అప్పుడు రామచంద్ర ఏమైంది జానకి గారు ఎందుకు అంతలా ఏడుస్తున్నారు అని అడుగుతుండగా జానకి చెప్పకుండా మరింత ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ఏమైంది జానకి గారు అనడంతో రామచంద్ర టెన్షన్ పడతాడని బాధపడతాడని జానకి అబద్ధాలు చెప్పి ఏమీ లేదు అని కవర్ చేస్తుంది. మీరు వెళ్లి స్నానం చేసి రండి అని చెప్పి జానకి మరింత ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
తర్వాత జ్ఞానాంబ పనిచేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జానకి వచ్చి మీరు ఇలాంటి పనులను చేయకండి అత్తయ్య నన్ను పిలిస్తే నేను వచ్చి చేస్తాను కదా అనడంతో ఏం కాదులే అనగా చేయకూడదు అని జానకి గట్టిగా చెబుతుంది. ఎందుకు జానకి అనడంతో మీరు కాస్త నీరసంగా ఉన్నారు కదా అందుకే డాక్టర్ గారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అని అంటుంది జానకి. వాళ్ళు అలాగే చెప్తాలే జానకి అని నువ్వు పట్టించుకోకు అని అంటుంది జ్ఞానాంబ. ఇప్పుడు జానకి ఈ టాబ్లెట్స్ మింగండి అనగా ఇంతలో మల్లీక అక్కడికి వచ్చి ఏ జ్వరము ఏ నొప్పులు లేనప్పుడు మరి టాబ్లెట్స్ ఎందుకు మింగాలి అదేదో అప్పుడే పోయే వారికి టాబ్లెట్స్ ఇచ్చినట్టు అనడంతో ఇంతలో తిలోత్తమా అక్కడికి వచ్చి నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాగకు.
నీకు అసలు చదువు సంధ్య లేదు.. జానకి చదువుకున్న అమ్మాయి కాబట్టి తనకు అన్నీ తెలుస్తాయి అని అంటుంది. అప్పుడు తిలోత్తమా జానకి గురించి పొగుడుతూ ఇప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి కోడలు దొరకడం నిజంగా నీ అదృష్టం జానకిని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ జానకి ఈ ఇంటి పెద్ద కోడలు మాత్రమే కాదు నాకు పెద్ద కూతురు కూడా అనడంతో ఆ మాటలకు మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జానకి డాక్టర్ అన్న మాటలు తలుచుకుని నిద్రపోకుండా జ్ఞానాంబ గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఆ తర్వాత తులసి కోటకు ఇంట్లో పూజ చేసి ఉండడంతో జ్ఞానంపై ఎవరు చేశారు అనుకుంటూ ఉండగా ఇందులో జానకి ఎక్కడికి వచ్చి నేనే పూజ చేశాను అత్తయ్య అనడంతో నాకు ఏం కాలేదు కదా జానకి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అయినా వేరు కాపురం పెట్టాలి అనుకున్నప్పుడు నువ్వు నీ భర్త గురించి మాత్రమే ఆలోచించు నా గురించి ఆలోచించకు ఎవరు ఎన్ని చెప్పిన నేను పూజలు చేస్తాను నాకు ఇంకా వయసు ఉంది అని మొండిగా మాట్లాడుతుంది జ్ఞానాంబ. అప్పుడు జానకి మీకు అసలు విషయం ఎలా చెప్పాలి అత్తయ్య అని దేవుడికి దండం పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. తర్వాత తిలోత్తమ జ్ఞానాంబను గుడికి వెళ్దాం రా అని చేయి పట్టుకుని పిలుచుకుని వెళ్తూ ఉంటుంది..
తర్వాత రామచంద్ర గోవిందరాజులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మలయాళం అక్కడికి వచ్చిన 3000 కావాలి వినడంతో రామచంద్ర అంతలేదు 1500 మాత్రమే ఉంది అనగా ఇంతలా గోవిందరాజులు, విష్ణు,అఖిల్ ని పిలిచి మలయాళం కి 3000 కావాలి మీరు కూడా ఇవ్వండి అని అంటాడు. అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు అనడంతో అయినా మమ్మల్ని వేరు కాపురం పెట్టమన్న తర్వాత ఇవన్నీ మీ ముందుకు ఇస్తాము అని మూర్ఖంగా మాట్లాడుతుంది మల్లిక. అప్పుడు రామచంద్ర ఒకటే సంపాదించి ఎన్నని చూసుకుంటాడు అనగా ఆయన ఏం ఖర్చులు చేస్తున్నారు మామయ్య అని మల్లిక అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ మల్లిక ఇంట్లోకి సరుకులు అన్ని ఎవరు తీసుకొస్తున్నారు అని అంటుంది జానకి.
మీరు బాత్రూంలో వాడే సబ్బునుంచి తినే తిండి వరకు అన్నీ ఆయన కష్టార్జితం కాదా అని అంటుంది. ఇప్పుడు విష్ణు అఖిల్ మూర్ఖంగా మాట్లాడుతూ ఖర్చులకు డబ్బులు ఇవ్వము అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు జ్ఞానాంబ అంటే మీ నాన్న ఇప్పుడు కష్టపడి నాలుగో వాటాగా డబ్బులు ఇవ్వాలా అని అంటుంది. అవన్నీ కాదు అందరి ఖర్చుల మీద నెలకి 20 వేల రూపాయలు ఖర్చు అవుతుంది అది మీ ముగ్గురు కలిసి ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు మల్లికా తెలివిగా మాట్లాడడంతో ఇంతలో గోవిందరాజులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా కలిపి ఒక్కొక్కరికి 7500 అవుతుంది అలా లెక్క వేసుకుంటే 15000 ఇవ్వాలి అనడంతో మల్లిక విష్ణు ఇద్దరు బిక్కమొఖం వేస్తారు.
అప్పుడు మల్లిక ఎందుకు లేండి మామయ్య గారు మీరు చెప్పినట్టు ఆ 6వేల చిల్లర ఇస్తాము అని అంటుంది. గోవిందరాజులు చెప్పినట్టు అందరూ కలిసి 6 వేల రూపాయలు ఇంట్లోకి ఖర్చులకు ఇస్తాము అని అంటారు. అప్పుడు ఎవరి పనికొద్దీ వారు వెళ్ళిపోతారు. అప్పుడు జ్ఞానాంబ బాధపడుతూ ఉండగా రామచంద్ర జానకి మీరు విడిపోమని చెప్పినా మేము విడిపోమమ్మా ఎప్పటికీ అందరూ మేము ఒక చోట కలిసి ఉంటాము అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ బాధ పడుతూ ఉండగా గోవిందరాజులు ఓదారుస్తూ ఉంటాడు. తర్వాత రామచంద్ర వాళ్ళు బయలుదేరగా తిలోత్తమ ఆనందంగా ఎదురు వస్తుంది. ఆ తర్వాత జానకి వాళ్ళు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా జానకి ఆలోచిస్తూ ఉంటుంది. జానకి కాలేజీకి వెళ్లుస్తాను అనగా జరిగిన విషయాలు తలుచుకొని బాధపడకుండా చదువుపై శ్రద్ధ పెట్టండి అని అంటాడు. తర్వాత జానకి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది.
