నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధించిన కోర్టు

jail sentenced to film producer bandla ganesh
Highlights

  • కేరక్టర్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమకు వచ్చిన బండ్ల గణేష్
  • నిర్మాతగా మారి పలు భారీ సినిమాలు తెరకెక్కించిన గణేష్
  • తాజాగా చెక్ బౌన్స్ వివాదంలో గణేష్ కు జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి

ప్రముఖ సినీ నిర్మాత బండ్లగణేష్ కు చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష పడింది. 'టెంపర్‌' సినిమాకు సంబంధించి వక్కంతం వంశీ కి ఇవ్వవలసిన రెమ్యునరేషన్ ఎగ్గోట్టే ప్రయత్నం చేయటానికే మోసానికి పాల్పడ్డాడన్న ఆరోపణపై, ఉద్దేశ ప్రకారమే చెల్లని చెక్కు ఇచ్చారని రచయిత ఫిర్యాదు చేయగా.. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టులో ఆ కేసు విచారణ జరిగింది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి.. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించారు. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది.

 

గతంలో కూడా బండ్ల గణేష్ టెంపర్ సినిమాకు సంబంధించి ఆర్థిక వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. టెంపర్ వివాదం ఒక్కటే కాదు హీరో సచిన్ జోషీతో తీసిన ఆషికీ 2 రీమేక్ "నీజతగా నేనుండాలి" సమయం లో కూడా ఆర్థిక లావాదేవీల విషయం లో పెద్ద గొడవ జరిగింది. చాలా సార్లు ట్విట్టర్ లో గొడవలు పడ్డ వీరిద్దరు మళ్లీ మరోసారి బూతులు తిట్టుకోవటం మొదలెట్టారు.

 

తాజాగా ఈ శిక్ష విధింపు గణేష్ మీద పెద్ద దెబ్బ కొట్టింది. కీలక పాత్రలు నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన బండ్ల గణేష్‌ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ‘ఆంజనేయులు' సినిమాతో నిర్మాతగా మారి. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ‘గబ్బర్‌సింగ్‌', ‘బాద్‌షా', ‘ఇద్దరమ్మాయిలతో', ‘టెంపర్‌' వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

loader