యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన హిట్ సినిమాల్లో 'జైలవకుశ' ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం అభిమానులను ఆకట్టుకుంది. జై, లవ, కుశ అనే మూడు పాత్రల్లో ఎన్టీఆర్ జీవించేశాడు. గతేడాది దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.

తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. నార్త్ కొరియాలో జరిగే 'బుచియాన్  ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్' లో రెండు రోజుల ప్రదర్శనకి గాను 'జైలవకుశ' సినిమాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడే ఏకైక తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నివేదా థామస్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు.

ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది.