స్టన్నింగ్ ఎన్టీఆర్ జై లవకుశ ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌ ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన ఫస్డ్ లుక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి మూడు విభిన్న పాత్రలలో నటిస్తున్న చిత్రం జై లవకుశ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా థామస్, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. నందమూరి ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ లుక్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని అందిస్తుంది. పోస్టర్ లో ఎన్టీఆర్ రౌద్రం, రాజసం కలగలిపిన రావణుడి గా కనిపిస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ నెగెటివ్ లుక్ అని అంటున్నారు. ఆగస్ట్ రెండో వారంలో విడదుల కానున్న ఈ చిత్రంపై తాజాగా విడుదలైన పోస్టర్స్ భారీ హైప్ తెచ్చాయి.
