యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా జై లవ కుశ భారీ అంచనాలతో గురువారం ప్రేక్షకుల ముందుకు జై లవ కుశ ఈ మూవీలో కొత్త ఎన్టీఆర్ ని చూస్తారన్న సెన్సార్ బోర్డు సభ్యుడు
ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం జై లవ కుశ. భారీ అంచనాల నడుమ ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూసేందుకు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోకి చెందిన టికెట్లు అమ్ముడుపోయాయి.
ఈ సినిమాకి సెన్సార్ సభ్యుడు ఉమర్ సందు ఇచ్చిన రివ్యూ, రేటింగ్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తారక్ కెరియర్ లో ది బెస్ట్ మూవీగా ఉమర్ చెప్పారు. మునెప్పన్నడూ చూడని ఎన్టీఆర్ ని ఇందులో చూస్తారని ఆయన అన్నారు.
ఈ ఏడాదికి టాలీవుడ్ నుంచి బెస్ట్ పెర్ఫార్మర్ ఎన్టీఆరేనని తేల్చేశారు. జై, లవ, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్స్ సూపర్ అని పొగిడారు. ఎన్టీఆర్ నటనకు అవార్డులు రావడం ఖాయమని పేర్కొన్నారు. డైలాగులు, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయన్నారు. హీరోయిన్లు నివేధ, రాశీలు కూడా బాగా నటించారని చెప్పారు.
కాస్త కత్తెరకు పని పడితే బాగుండేది అని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని సీన్లు సాగదీసినట్టుగా అనిపించినా ఓవరాల్ గా సినిమా అదుర్స్ అని ఆయన చెప్పారు. చివరి క్లైమాక్స్ 15 నిమిషాలు ప్రేక్షకుడి ఊహకి అందనంత బాగా తీశారని టాక్.
