యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ చిత్రంగా నిలిచింది. ఇటీవల వరకు థియేటర్స్ లో నడిచిన జైలవకుశ బాక్సఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ట్రేడ్ ఎనలిస్టుల లెక్కల ప్రకారం జైలవకుశ నైజాం ఏరియాలో 16కోట్లు షేర్ వసూలు చేసింది. వైజాగ్ లో 7కోట్లు, 5.57కోట్లు ఈస్ట్., వెస్ట్ లో 3.74కోట్లు, కృష్ణాలో 4.69కోట్లు, నెల్లూరులో 2.54కోట్లు షేర్ సాధించింది.

 

మొత్తంగా ఆంధ్రాలో 29.73కోట్లు షేర్ వసూలు కాగా, సీడెడ్ లో 12.04కోట్లు షేర్ సాధించింది. మొత్తం నైజాం, ఆంధ్రాలో కలిపి 93.15కోట్లు గ్రాస్ వసూళ్లు రాగా... వీటిలో 57.79కోట్లు షేర్ దక్కింది.

 

అదే సమయంలో కర్ణాటకలో 15కోట్ల గ్రాస్ తో 7.48 కోట్లు షేర్ సాధించింది. యుఎస్ కలెక్షన్స్ గ్రాస్ 10.20కోట్లు రాగా షేర్ 5.10కోట్లు వచ్చింది. తమిళనాడులో 1.30కోట్లు, దేశంలోని మిగతా ప్రాంతాల్లో 1.15కోట్లు, యుఎస్ మినహా మిగిలిన దేశాల్లో 2.52కోట్లు షేర్ సాధించింది. ఇలా మొత్తం వరల్డ్ వైడ్ 130.9కోట్ల గ్రాస్ సాధించి 75.34కోట్లు షేర్ సాధించింది.

 

జై లవకుశ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 86కోట్లు కాగా 87.6శాతం రికవరీ అయింది. ఇలా దక్షిణాది హీరోల్లో హ్యాట్రిక్ 1.5మిలియన్ డాలర్ గ్రాస్ సాధించిన హీరోగా ఎన్టీఆర్ రికార్డు సృష్టించాడు.